MP K. Laxman : తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు వేర్వేరు పార్టీలు అన్న ప్రచారం ప్రజలను మోసగించేందుకు మాత్రమేనని, వాస్తవానికి ఈ రెండు పార్టీలకు నడివీధిలో సంబంధం ఉన్నట్టే కాంగ్రెసే భవిష్యత్గా ఎదిగేందుకు బీఆర్ఎస్ తో చేతులు కలిపిందని అన్నారు. తమిళనాడు…
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, భవిష్యత్తులో BRS అధికారంలోకి రావడంపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ BRS పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “సింగిల్గా అధికారంలోకి వచ్చేది…
MLC Kavitha: శాసన మండలిలో బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేవలం కేసీఆర్ ని నిందించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారు.. అబద్దాల విషయంలో ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే ఈసారి బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరం కానున్నారు. ఈరోజు జరగబోయే బడ్జెట్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ గైర్హాజరు అవనున్నారు. గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఈసారి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగంతో…
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్న సాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకపొతే రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేశారు.
Ponnam Prabhakar: యాదగిరి గుట్ట టెంపుల్ పై శాసన మండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట అభివృద్ధి చేశామని చెప్తున్నారు.. మా జిల్లా దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. కానీ, ఎక్కడా అభివృద్ధి జరగలేదు అని తెలిపారు.
Gutha Sukender Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో అలా యాదగిరిగుట్ట నిర్మాణం చేశారు కేసీఆర్ అని శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, గుడుల పట్ల ఆయనకు ఉన్న అభిలాషతోనే ఈ ఆలయ నిర్మాణం సాధ్యమయింది..
MLA Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యా్ఖ్యలు చేశారు. కేసీఆర్ వేల కోట్లు అప్పు చేసినా.. ఏం చేశారో కానీ.. యాదగిరి గుట్టను మాత్రం కట్టారు.. అది మంచి ఆలోచన అని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని అన్నాడు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ గా ఉన్నాడని వెల్లడించాడు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము…
MLC Kavitha : నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని…