గిరిజనులను అనాధలుగా చేశారు సీఎం కేసీఆర్. భూముల పై హక్కులు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. సీలింగ్ యాక్ట్ తెచ్చి గడిల దగ్గర బందీ అయిన భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలు ఐఏఎస్..ఐపీఎస్ లు అయ్యే అవకాశం కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ లే గిరిజనుల కు అండ. రెండు పర్యాయాలు తెరాస కి అధికారం కట్టబెట్టి నా… గిరిజనుల హక్కులు లేకుండా పోయాయి. పోడు…
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నా జరిగింది. ఈ ధర్నాసభలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని, ఆ భూమిని ప్రజలకు పంచుతామని అన్నారు. పోడు భూములను పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమిని…
కేసీఆర్ కుటుంబంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రమంతా అప్పుల పాలు అయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని షర్మిల విమర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఏడేళ్లుగా ఏకంగా 4 రెట్లు నిరుద్యోగం పెరిగిందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. దళితులకు రూ.10 లక్షలు కాదు, రూ.50 లక్షలు ఇవ్వాలని…
హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ అధినేత, సీఎం కె. చంద్రశేఖర్ రావు.. దళిత బంధు పథకాన్ని పైలట్‌గా ఆ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే కాదు.. ప్రతిపక్షాల విమర్శలకు సైతం తన దైన శైలిలో.. పథకాల ద్వారా లబ్ధిపొందాలని చూడమా? మాది రాజకీయా పార్టీ కాదా? అంటూ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.. ఇక. తాజాగా.. ఆ ప్రాంత ఎంపీటీసీకి ఫోన్ చేసి.. కేసీఆర్ నెరిపిన సంభాషణ ఇప్పుడు…
గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అన్నారు. అధికారులు, టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. Read: గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ? ఎస్సారెస్సీకి వరద ఉదృతి…
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలంగాణా ఫిలిమ్ ఛాంబర్ కృతజ్ఞతలు తెలిపింది. సినిమా ప్రదర్శనదారులతో కలసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, కె.టి.రామారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఛీప్ సెక్రటరీ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ కు ఓ లేఖ రాస్తూ తమ అభ్యర్ధన మేరకు సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే సౌలభ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. పలు సమస్యల వల్ల థియేటర్లు మూతవేసుకునే పరిస్థితి వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం తమను ఆదుకునేందుకు ముందుకు…
మీరంతా (ప్రజలు) నా వెంట ఉన్నంత కాలం నా లైన్ ఎవరు మార్చలేరు… ఎవరు ఏమి మాట్లాడినా నన్ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ భవన్లో టి.టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాత్ర ఏంటో అందరికీ తెలుసు అన్నారు.. తెలంగాణ వచ్చాక ఏమి జరిగిందో జనం కళ్ల ముందు ఉందన్న ఆయన.. తప్పు…
ఇప్పటికే తెలంగాణ టీడీపీకి రాజీనామా చేసిన ఎల్. రమణ ఇవాళ కారెక్కారు… తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన రమణ.. ఈ మధ్యే సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.. కాసేపటి క్రితం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్భంగా ఎల్. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్… రమణతో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ గూటికి చేరారు. కాగా, ఇటీవలే…
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. కృష్ణా, గోదావరి జలాలకు సంబందించిన అన్ని విషయాలు బోర్డులే చూసుకుంటాయని చెప్పి గెజిట్‌ను విడుదల చేసింది. ఈ గెజిట్ అక్టోబర్ 14 వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలియజేసింది. గెజిట్ నోటిఫికేషన్‌ను ఆంధ్రనేతలు ఆహ్వానిస్తుంటే, తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు జలాల విషయాన్ని బోర్డులకు అప్పగించడంపై మండిపడుతున్నారు. Read: రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్…