సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం… విద్యా సంస్థలు తెరవచ్చని నివేదిక ఇచ్చింది వైద్య ఆరోగ్యశాఖ.. దీంతో.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.. 1వ తేదీ నుంచి అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్… విద్యాశాఖ మంత్ర సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో.. ఇవాళ విద్యాశాఖ అధికారులు కూడా నివేదిక ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్.. అన్ని క్లాసులకు ప్రత్యక్ష బోధన నిర్వహించాలని ఆదేశించారు. అయితే, స్కూళ్ల ప్రారంభంపై ఇవాళో.. రేపో.. మార్గదర్శకాలు విడుదల చేయనుంది సర్కార్.
కాగా, ప్రత్యక్ష బోధనకు అనుమతించాలంటూ విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. కోవిడ్ తీవ్రత తగ్గిందని, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు సరైన వాతావరణం నెలకొందని వైద్య ఆరోగ్య శాఖ సైతం పేర్కొంది. పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యక్ష బోధన ప్రారంభించాయని.. ఆన్‌లైన్ పాఠాలు ఫలితాన్ని ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో కొందరు తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.. దీంతో.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై దృష్టిసారించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.