ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్కు లేదు.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హుజురాబాద్లో దళిత బంధు నిలుపుదలకు కేసీఆరే కారణం అన్నారు.. రెండు నెలలలోపు హుజురాబాద్ లో అందరికి “దళిత బంధు” ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళిత బంధును బీజేపీ ఆపిందని నిందలు వేస్తున్నారని విమర్శించారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి…
యాదాద్రి ఆలయ పునః ప్రారంభం ఎప్పుడు అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు… టెంపుల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇలా.. ఎప్పటికప్పుడు భక్తులను కట్టిపడేస్తున్నాయి.. దీంతో.. యాదాద్రి ప్రారంభం ఎప్పుడు.. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేది మరెప్పుడు అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్.. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ…
తెలంగాణలో జరగబోయే హుజూరాబాద్ ఎన్నికలపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. తెలంగాణాలో జరిగే ఎన్నికలు పగటి డ్రామాలా లేక పవిత్ర ఎన్నికల విధానాలా అని విమర్శించారు. ఎన్నికల విధానాలను భ్రష్టు పట్టించేవిగా వున్నాయన్నారు. ముందస్తు ప్రణాళికలో భాగం గానే దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని, అయితే అందులో కూడా దళిత బంధు ఇచ్చినట్టే వుండాలి. పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు అందకూడదన్న చందంగా తయారైందన్నారు. కూడు కుండనిండుగుండాలి , బిడ్డమాత్రం బొద్దుగుండాలి ” అన్నట్టుగా వుందన్నారు నారాయణ. ఈనాటకాలలో…
యాదాద్రి: యాదగిరిగుట్టలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ .. హుజురాబాద్లో దళిత బంధును అడ్డుకునేది బీజేపీనే అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని గెలిచేది టీఆర్ఎస్యే అని పేర్కొన్నారు. కావాలనే బీజేపీ దళిత బంధును అడ్డుకుందని తెలిపారు. బీజేపీ అండతో ఈటల ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ యే అన్నారు. రానున్న రోజుల్లో యావత్ దేశమే కేసీఆర్ బాటలో నడవనుందని…
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాల్లో వేగం, వేడి పెరుగుతోంది. మంగళవారం హుజురాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద స్కీంలకు ఇందిరానగర్- శాలపల్లి కేంద్రంగా మారిందన్నారు. శాలపల్లిలో దళితబంధు ఆరంభించి 65-66 రోజులైందని, ఈ స్కీం మొదటి ఇక్కడే లాంఛ్ చేయలేదని, భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారని గుర్తు చేశారు. దళితబంధు నేను వద్దన్నట్లు దొంగ ఉత్తరం…
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ .. అది కేవలం వాట్సాప్ యూనివర్సీటీ ప్రచారం మాత్రమేనని ఇలాంటి గ్లోబల్ ప్రచారాలను ఎవ్వరూ నమ్మోద్దన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడమనేది సందర్భానుసారాన్ని బట్టి ఉంటుందన్నారు. వాట్సాప్ లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దెశిస్తూ కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎందుకు రాజకీయ సన్యాసం…
సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి చేరుకున్నారు. కేసీఆర్ ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ పున:నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. మహా సుదర్శన యాగాల తేదిలతో పాటు ఆలయ పున: ప్రారంభ తేదిలను కూడా నేడు ప్రటించే అవకాశం ఉంది. మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు, సీఏఓం అధికారులు పాల్గొన్నారు. ఆలయ పనులతో…
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం తాజాగా ప్రకటించారు. గతంలో మాదిరిగా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటన్నింటిని పూర్తి చేశాకే ఎన్నికలకు వెళుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావించిన 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.‘విజయగర్జన’ పేరుతో నిర్వహించనున్న ఈసభకు దాదాపు 10లక్షల…
పచ్చటి సంసారంలో సైతం కేసీఆర్ చిచ్చు పెడతారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతుల్లో ఇక్కడ పుడితే టీఆర్ఎస్లోనే ఉండాలి అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.. ఉద్యోగాలు పీకేస్తాం అని, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ రాకుండా చేస్తామని అంటున్నారట.. ఆపడం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరించారు. వీటికి ఇచ్చే డబ్బులు…
రాష్ట్రాల పరిధిలో ఉన్న నీటిపై కేంద్రం పెత్తనం మంచిది కాదని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్రాలు అవకాశం ఇస్తున్నాయని, దీని వలన రాష్ట్రాలు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని పొన్నాల పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టులను ప్రారంభించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నించారు. లక్షకోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం వల్ల ఎంత ప్రయోజనం జరుగుతున్నదో కేసీఆర్ చెప్పగలరా…