హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారంలో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు దిగుతోందని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ గెలిచే పరిస్థితే ఉంటే.. దాడులకు దిగుతుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఫ్రెస్టేషన్‌లో ఉందని, కిషన్ రెడ్డి తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Read Also : హుజురాబాద్ మహిళలు మెచ్చే నాయకుడెవరో..?
బీజేపీ ఓటమి భయంతోనే సీఎం సభను, దళిత బంధును అడ్డుకున్నారన్నారు. ‘మా పార్టీ కార్యాలయం ముందు.. మా కేసీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేయించడం కిషన్ రెడ్డి కి తగునా’ అని నిలదీశారు.. ఎన్నికల కమిషన్‌ని అడ్డు పెట్టుకుని బీజేపీ డ్రామాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు బాల్క సుమన్.