హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారంలో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు దిగుతోందని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ గెలిచే పరిస్థితే ఉంటే.. దాడులకు దిగుతుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఫ్రెస్టేషన్లో ఉందని, కిషన్ రెడ్డి తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also…
అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. దీంతో ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఈటల సోలోగా ఉప ఎన్నిక బరిలో దిగుతారని, సొంత పార్టీ పెడుతారంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ ఈటల అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. దీంతో ఈటల ఒంటిరిగా పోరాడుతాడనుకున్న గులాబి నేతలకు షాక్ తగిలినట్లైంది.…
కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామి ఇచ్చారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూర్ ఆపరేటర్స్‌కు రూ.10లక్షల రుణాలు బ్యాంకుల ద్వారా అందింస్తామని తెలిపారు. మేడారం జాతరను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన కిషన్‌రెడ్డి, మేడారం జాతర గురించి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా ప్రచారం చేస్తామన్నారు. అంతేకాకుండా తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, అభివృద్ధి…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వడమే కాకుండా సంచలనంగా మారుతుందన్న విషయం తెలిసిందే. నిజానికి వివాదాలతోనే ఆయన సినిమాలకు హైప్ క్రియేట్ చేసి పబ్లిసిటీని పెంచుకుంటారు. ప్రస్తుతం ఆయన కొండా దంపతుల జీవితం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సినిమాను ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరంటూ అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చారు ఆర్జీవీ. Read Also : పారితోషికం…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునఃనిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల నిధులతో యాదాద్రి ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిభ కలిగిన శిల్పకారులతో ఆలయంలోని స్థంభాలు డిజైన్ చేయిస్తున్నారు. యాదాద్రి ఆలయంలో అడుగడుగునా అబ్బురపరిచే కళానైపుణ్యం దర్శనమిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం దాతలు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 36.16 కిలోల బంగారాన్ని దాతలు విరాళంగా…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంది. బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతుగా హేమాహేమీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎంపీ విజయశాంతి. తెలంగాణ ఉద్యమంలో ఈటెల నేను కలిసి పని చేశాం. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ హుజురాబాద్ లో అడ్డా వేశారన్నారు. ఒక ఉద్యమ కారుడు ఈటల.. ఆలాంటి వ్యక్తిని ఎందుకు ఓడిస్తావు కేసీఆర్ అని ప్రశ్నించారు విజయశాంతి.…
హుజూరాబాద్ ఎన్నికల్లో వేడి పెరుగుతూనే వుంది. జమ్మికుంటలో మహిళల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు ఎందుకు ఓటువేయాలో ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు, టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఉందని, ఏడేళ్లలో ఏ యే వర్గానికి ఎంత మేలు జరిగిందో మీకు తెలుసు అన్నారు. ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలను కెసిఆర్ గుర్తించి పరిష్కరించారని..తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ అంతటా స్వచ్ఛమయిన…
తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాల విద్యాశాఖలో 5323 పోస్టుల తాత్కాలిక భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు 2,343 ఇన్ స్ట్రక్టర్లు, 1,435 ఉపాధ్యాయులు, వ్యాయమ ఉపాధ్యాయలు, కేజీబీవీలకు 937 పోస్టు గ్రాడ్యుయేట్ రెసిరెన్షియల్ టీచర్ల పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు 397 ఒకేషనల్ ట్రైనర్లు, ఒకేషనల్ కో-ఆర్డినేటర్లు, ప్రభుత్వ ఎంఈడీ కళాశాలలకు 211 బోధనా సిబ్బంది పోస్టులకు తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేసేందుకు అనుమతులు జారీ…
యాదాద్రి ఆలయం పునఃప్రారంభం కాబోతున్న తరుణంలో ఆలయంలోని విమాన గోపురం స్వర్ణమయం కాబోతున్నది. ఈ విమాన గోపురం స్వర్ణతాపడం కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ 2కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని అనేక మంది దాతలు బంగారాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమన్ కిలో బంగారం, జలవిహార్ ఎండీ కిలో బంగారం, హెటిరో గ్రూప్ 5 కిలోల బంగారం,…
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన యాదాద్రి ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఆలయ నిర్మాణానికి ఇప్పటికే ఎంతో మంది ధన రూపేన, వస్తు రూపేన కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా టీఆర్ఎస్ నేతలు యాదాద్రి ఆలయానికి విరాళం ప్రకటించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ఎం. హనుమంత రావు, ఎం కృష్ణ రావుతో పాటు కెపి వివేక్ ఆనంద్ లు…