Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు.
తెలంగాణ హక్కులు కాపాడాలనేది మా ఆలోచన అన్నారు. అయితే, కేసీఆర్, హరీష్ రావుల దగ్గరే తొమ్మిదిన్నరేళ్ల పాటు నీటి పారుదల శాఖ ఉంది.. వాళ్ళ మీద పెట్టిన నమ్మకం వమ్ము చేశారు.. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకి గుది బండలాగా మారింది.. నికర జలాల మీద కేటాయింపుల్లో స్పష్టత ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Madhusudhana Chary: బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు అనే మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారి తెలిపారు. ఆయనకు రాజకీయలా పట్ల అవగహన లేదని అర్ధం అవుతుంది.. అతడి మాటలతో ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపాలి అన్నారు.
Beerla Ilaiah: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపుతూ ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై బీఆర్ఎస్, బీజేపీ మైత్రి మరోసారి బయటపడిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగిందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి “అవయవ దానం” చేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు లాంటి బలహీన వ్యక్తిని నియమించడం…
ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. అయితే... తెలంగాణలో వ్యవహారం కాస్త డిఫరెంట్గా ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మొదట ఈ ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని...కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కానీ... ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి రివర్స్ అటాక్ మొదలవడంతో మేటర్ రసకందాయంలో పడిందని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో సమావేశం పెట్టింది సర్కార్.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఎమ్యెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ఆడియోలు రిలీజ్ చేశారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో చేవెళ్ల ఎంపి కొండా విశ్వే్శ్వర్ రెడ్డి తన వాంగ్మూళం ఇచ్చేందకు సిట్ ముందు హాజరయ్యారు. గంటన్నరకు పైగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తన ఫోన్ ట్యాపింగ్ కు…
మరోసారి తెలంగాణలో ఆంధ్రా బిర్యానీని ఉడికించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత వంటకాలను, అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రా ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడి
Niranjan Reddy: తెలంగాణ భవన్ లో నేడు (బుధవారం) మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితుల మధ్య మంత్రులు పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో భాగంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంబరాలు చేయడానికి ఈ ప్రభుత్వం కు అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాళ్లు, రప్పలకు రైతు బందు ఇచ్చారని తప్పు పట్టారన్నారు. అయితే ఇప్పుడు కూడా…
MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోమారు రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. నేడు ఆమె అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డ్ రాశారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అని అన్నారు. తన కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు బాగా…