Jammu and Kashmir: బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో టిఆర్‌ఎఫ్ ఉగ్రవాది హతమయ్యాడు అని అధికారులు వెల్లడించారు. వివరాలలోకి వెళ్తే.. విచక్షణారహితంగా దాడులు చేస్తూ దేశంలో శాంతి భద్రతలను ఆటంక పరిచే ఉగ్రవాదుల పైన ఇండియన్ ఆర్మీ ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరిపారేసేందకు కశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కలిసి సంయుక్తంగా బుధవారం ఎన్‌కౌంటర్ ని ప్రారంభించారు. ఈ ఆపరేషన్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదికి..…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం దక్కింది. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. గురువారం రోజున ఉగ్రవాదలు కుప్వారా సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. హతమైన ఐదుగురు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదులను సైన్యం, భద్రతాబలగాలు ఏరిపారేస్తున్నాయి.
Teacher Arrested For Blasts In Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారి బాంబు దాడులకు తెగబడ్డాడు. తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైష్ణో దేవి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో ఒకదానితో సహా పలు పేలుళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా మారిన లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ గురువారం తెలిపారు.…
Biggest Arms Recovery, Forces Stop Major Pak Attempt In Kashmir: దాయాది దేశం పాకిస్తాన్ ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో అలజడులు రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను వెంటాడి వేటాడి మట్టుబెడుతున్నాయి. దీంతో కొత్తగా హైబ్రీడ్ టెర్రిరిజాన్ని కూడా ప్రారంభించాయి ఉగ్రవాద సంస్థలు. అమాయకులైన పౌరులను కాల్చి చంపేస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని కూడా భద్రతా బలగాలు చంపేస్తున్నాయి.…
Man Kills Mother, Neighbours After Fight Over "Going Out Naked": జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. నగ్నంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొడుకును వారించింది తల్లి. దీంతో తల్లిని దారుణంగా హత్య చేశాడు కొడుకు. అడ్డుగా వచ్చిన చుట్టుపక్కల వారిపై దాడి చేసి మరో ఇద్దరిని చంపేశాడు. నిందితుడు మానసిక వికలాంగుడిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
Encounter breaks out between security forces and terrorists in J&K’s Anantnag: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆదివారం తెల్లవారుజామున అనంత్ నాగ్ జిల్లాలో భద్రతాబలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కి చెందిన హైబ్రీడ్ ఉగ్రవాదిని మట్టుపెట్టారు కాశ్మీర్ పోలీసులు. ఉగ్రవాదుల రహస్యస్థావరాలను గుర్తించే క్రమంలో ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని…
Lashkar Terrorist Killed In Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పుల్వామాలో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ మరణించారు. సీఆర్పీఎఫ్ కు చెందిన సిబ్బంది గాయపడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. పుల్వామాలోని పింగ్లాన వద్ద సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
Encounter Breaks Out In Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో భద్రతబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో జైషే మహ్మద్(జేఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. బాముముల్లా జిల్లాలోొని మోడిపోరా, పట్టన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దీనికి ముందు శుక్రవారం ఉదయం షోఫియాన్ జిల్లాలో కూడా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో గాలింపులు…
Hybrid Terrorists Arrested In Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రిస్టులను అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ టెర్రర్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని ఆర్మీ, పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో అనంత్ నాగ్ జిల్లా వాఘామా-ఓప్జాన్ రోడ్‌లో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలోనే…