PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (ఏప్రిల్ 11న) వారణాసిలో పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా రూ.3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక, ఉదయం 10 గంటలకు ఆయన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. గవర్నర్ ఆనంది బెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలుకనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాలో ఈరోజు చివరి రోజు. మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. ఇప్పటికే కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా కారణంగా.. కుటుంబం నుంచి తప్పిపోయిన వాళ్లను సైతం కొంత మంది కలుసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకలోని విజయపురానికి చెందిన రమేష్ చౌదరి. ఈయన 24 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా ద్వారా తన కుటుంబాన్ని తిరిగి కలిశాడు.
తెలంగాణ రాష్ట్రం బైంసా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు.. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు. సజీవ దహనం ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
తిరుపతి బాలాజీ ప్రసాదంపై వివాదాల నేపథ్యంలో సంత్ సమాజ్ తీవ్రంగా మండిపడింది. ఇదిలా ఉండగా.. ధార్మిక నగరమైన కాశీలో తిరుపతికి వెళ్లే భక్తులు ఇప్పుడు శుద్ధి చేసి ఈ పాపాన్ని కడిగేస్తుకుంటున్నారు.
మన దేశంలో కుల మత బేధం లేకుండా అందరు ఆనందంగా జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. హోలీ అంటే అందరికి సరదా.. హోలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మార్చి 25 న హోలీ పండుగ వచ్చింది.. ఊరు వాడలు హోలీ సంబరాల కోసం సిద్ధం అవుతున్నారు.. హోలీని రకరకాల రంగులతో జరుపుకోవడం అందరు చూసే ఉంటారు.. కానీ బూడిదతో జరుపుకుంటారని ఎప్పుడైనా విన్నారా? అవును మీరు…
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మధుర, అయోధ్య గురించి మాట్లాడారు. రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజులు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతనను సంతరించుకున్నాయి. అయోధ్య నగరాన్ని గత ప్రభుత్వాలు నిషేధాలు, కర్ఫ్యూల పరిధిలో ఉంచాయని, శతాబ్ధాలుగా అయోధ్యను నీచ ఉద్దేశాలతో తిట్టారని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం బహుశా మరెక్కడ చూడలేదని, అయోధ్యకు అన్యాయం జరిగిందని యోగి అన్నారు.
Gyanvapi mosque case:వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయం గతేడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. స్థానిక కోర్టు ఆదేశాలతో వీడియో రికార్డింగ్ చేస్తున్న సమయంలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో ‘శివలింగం’ లాంటి నిర్మాణం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త దేశంలో చర్చనీయాంశంగా మారింది.
దేశంలో ప్రముఖంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈరోజు జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి హైకోర్ట్ లో విచారణ జరిగింది. జ్ఞానవాపి మసీదు సర్వేపై కోర్ట్ విచారణ జరిపింది. సర్వే చేయాలని కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించింది. కమిషన్ మే 17 లోగా నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. అయితే ఈ వివాదంపై ఇటు హిందువులు, అటు ముస్లింల తరుపున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు.…