Yogi Adityanath: “కృష్ణుడు 5 గ్రామాలు అడిగాడు, మేం 3 అడుగుతున్నాం”.. అయోధ్య, మధుర, కాశీలపై యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మధుర, అయోధ్య గురించి మాట్లాడారు. రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజులు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతనను సంతరించుకున్నాయి. అయోధ్య నగరాన్ని గత ప్రభుత్వాలు నిషేధాలు, కర్ఫ్యూల పరిధిలో ఉంచాయని, శతాబ్ధాలుగా అయోధ్యను నీచ ఉద్దేశాలతో తిట్టారని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం బహుశా మరెక్కడ చూడలేదని, అయోధ్యకు అన్యాయం జరిగిందని యోగి అన్నారు.
Read Also: Sharad Pawar: శరద్ పవార్ కొత్త పార్టీ.. ఈసీ గ్రీన్‌సిగ్నల్
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
‘‘ నేను అన్యాయం గురించి మాట్లాడేటప్పుడు, మేము 5,000 ఏళ్ల నాటి విషయం గుర్తుకు తెచ్చుకుంటాము. ఆ సమయంలో పాండవులకు కూడా అన్యాయం జరిగింది. అయోధ్య, కాశీ, మధురలోనూ అదే జరిగింది’’ అని యోగి అన్నారు. ‘‘ఆ సమయంలో కృష్ణుడు కౌరవుల వద్దకు వెళ్లి మాకు 5 గ్రామాలు ఇవ్వండి, మీ వద్ద ఉన్న భూమి అంతా మీరే ఉంచుకోండని, సగం అయినా న్యాయం చేయాలని కృష్ణుడు అడిగాడు, కానీ ఇక్కడ సమాజం వందల ఏళ్లుగా మూడు, కేవలం మూడు ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారని, అయోధ్య, మధుర, వారణాసి గురించి ప్రస్తావించారు. ఈ మూడు స్థలాలు దేవుళ్ల అవతార ప్రదేశాలు’’ అని ఆయన అన్నారు.
అయోధ్య రాముడి జన్మస్థలంగా పరిగణించబడితే, మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలంగా నమ్ముతారు. వారణాసిలోని జ్ఞానవాపి ప్రదేశం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే, ఈ ప్రాంతా విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని, అవే వివాదానికి దారి తీస్తోందని, మేము మూడు స్థలాలు మాత్రమే అడిగాము, ఇతర స్థలాలతో ఎలాంటి వివాదం లేదని యోగి అన్నారు. వారణాసిలోని జ్ఞానవాపి సెల్లార్‌లో పూజలకు కోర్టు అనుమతించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలు అయోధ్యలో వేడుకలు చూస్తుంటే, నేను ఎందుకు వేచి ఉండాలని నందీబాబా అడిగారని అన్నారు. మహాశివుడి వాహనంగా నందిని సూచిస్తారు. పరోక్షంగా కాశీ విశ్వనాథ దేవాలయం గురించి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!