మన దేశంలో కుల మత బేధం లేకుండా అందరు ఆనందంగా జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. హోలీ అంటే అందరికి సరదా.. హోలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మార్చి 25 న హోలీ పండుగ వచ్చింది.. ఊరు వాడలు హోలీ సంబరాల కోసం సిద్ధం అవుతున్నారు.. హోలీని రకరకాల రంగులతో జరుపుకోవడం అందరు చూసే ఉంటారు.. కానీ బూడిదతో జరుపుకుంటారని ఎప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ ప్రాంతం గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఎందుకు బూడిదతో హోలీ జరుపుకుంటారో ఒక్కసారి తెలుసుకుందాం..
అదెక్కడో కాదు.. మన దేశంలోనే.. మహా పవిత్ర స్థలం అయిన కాశీ.. ఇక్కడ హోలీని బూడిదతో జరుపుకుంటారు.. అలా జరుపుకోవడం వెనుక పెద్ద చరిత్ర ఉందని చెబుతున్నారు.. శివ పార్వతులు తమ పెళ్లి తర్వాత హోలీని బూడిదతో జరుపుకున్నారట.. ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతంలో హోలీ వచ్చిందంటే బూడిదతో జరుపుకుంటారు.. హోలీ రోజున అక్కడ ఉంటే సాదువులు అంతా కలిసి భజనలు చేస్తూ శివయ్యకు పూజలు చేస్తారు.. ఆ తర్వాత అక్కడ ఉండే చితి భష్మంతో హోలీని జరుపుకుంటారు..
మరో చరిత్ర కూడా ఉంది.. శివ పార్వతుల వివాహం ఎలా జరిగింది అన్న విషయం అందరికి తెలిసిందే. వీరి వివాహానికి దేవతలు, రాక్షసులతో సహా సమస్త ప్రాణులను ఆహ్వానించారు.. ఆ తర్వాత హోలీని జరుపుకోవాలని కాశీలోని వారంతా కోరగా శివయ్య వారితో హోలీని జరుపుకున్నారని చరిత్ర చెబుతుంది.. అంతేకాదు చనిపోయిన తర్వాత అందరు కాటికే చేరాలి.. అందుకే ముందే ఆ పండుగను జరుపుకుంటారు.. దాన్ని మసాని హోలీ అనిపిస్తారు.. అందుకే అక్కడ హోలీ వేడుకలను బూడిదతో జరుపుకుంటారు..