Karthikeya 2: హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో నిఖిల్ సిద్దార్థ్. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వంత కష్టంతో తనకంటూ ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో.
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ను డైరెక్ట్ చేసిన చందు మొండేటి దీన్ని తెరకెక్కించాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కాలభైరవ స్వరాలు సమకూర్చిన ఈ మూవీలోని ‘అడిగా నన్ను నేను అడిగా… నాకెవ్వరు నువ్వని’ అనే గీతాన్ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఉత్తర భారతానికి సంబంధించిన అందమైన లొకేషన్స్ ను ఈ పాటలో కార్తిక్ ఘట్టమనేని…
ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘కార్తికేయ 2’ ఒకటి. నిఖిల్ సిద్ధార్థ్, చందూ మొండేటి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం.. బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ’కి సీక్వెల్. చాలాకాలం నుంచి నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో ప్రారంభమయ్యే ఈ మోషన్ పోస్టర్‌లో ఓ రహస్యాన్ని చేధించేందుకు సముద్రంలో ప్రయాణిస్తోన్న నిఖిల్, అనుపమ, శ్రీనివాస రెడ్డిని గమనించవచ్చు. ఇన్నాళ్ళూ ఇది…
నటి అనుపమ పరమేశ్వరన్ అభిమానుల గుండెల్లో తూట్లు పొడిచేసింది. తాను ప్రేమలో ఉన్నానంటూ కుండబద్దలు కొట్టింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. మొదట పెళ్ళి గురించి అడగ్గా.. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపింది. ప్రేమ వివాహంపై తనకు సదాభిప్రాయం ఉందని, ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటల్ని చూస్తే ముచ్చటగా అనిపిస్తుందని పేర్కొంది. తనక్కూడా ప్రేమ పెళ్ళే చేసుకోవాలనుందని, తన…