Geetha Arts Planning Pan India Film With Chandoo Mondeti And Hrithik Roshan: టాలీవుడ్‌లో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో చందూ మొండేటి ఒకడు. తన మొదటి చిత్రం ‘కార్తికేయ’తోనే ఇతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ‘కార్తికేయ 2’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా.. బాలీవుడ్‌లో ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. దీంతో.. ఇతనికి ఇప్పుడు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు అతనితో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ అతనితో ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తోందని సమాచారం.
నిజానికి.. ‘కార్తికేయ 2’ విడుదల అవ్వడానికి ముందే గీతా ఆర్ట్స్‌తో ఓ సినిమా ఒప్పందం కుదుర్చుకున్నాడు చందూ మొండేటి. ఇప్పుడు ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో, చందూతో ఓ మెగా-బడ్జెట్ సినిమా చేయాలని ఆ నిర్మాణ సంస్థ ఫిక్స్ అయ్యింది. ఇందులో కథానాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌ని తీసుకోవాలని చూస్తున్నారు. హృతిక్ రోషన్ ఫుల్ స్వింగ్‌లో ఉండటం, అతనికి పాన్ ఇండియా ఇమేజ్ ఉండటంతో.. అతనితోనే ఈ ప్రాజెక్ట్ చేయాలని గీతా ఆర్ట్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్టు సవ్యంగా కుదిరితే.. చందూ-హృతిక్ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది. మరి.. ఈ కాంబో సెట్ అవుతుందో? లేదో? కాలమే సమాధానం చెప్పాలి.