This Weekend Movies: ఈ వారంలో తెలుగు సినిమాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Movies Releasing This Weekend: ఆగస్ట్ 1 నుండి సినిమా షూటింగ్స్ ఆగిపోయిన నేపథ్యంలో వివిధ శాఖలతో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పెద్దలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఆగస్ట్ 5న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు చక్కని విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్రసీమకు కొత్త ఊపిరిలద్దినట్టు అయ్యింది. దాంతో ఈ వారాంతంలో విడుదలయ్యే సినిమాలపైనా భారీ ఆశలు చిగురించడం మొదలైంది. ఈ నెల 11న ఆమీర్ ఖాన్ పాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ విడుదల కానుంది. నాగచైతన్యకు ఇదే తొలి హిందీ చిత్రం కాగా, ఈ సినిమా తెలుగు వర్షన్ కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. అయితే గతంలో ఆమీర్ ఖాన్ ‘ఈ దేశాన్ని విడిచి పోదామని తన భార్య అంటోంద’ని అసహనం వ్యక్తం చేసిన సంఘటనను, ‘పీకే’ సినిమాలో శివుడి పాత్రను అపహాస్యం చేయడాన్ని గుర్తు చేస్తూ కొందరు సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టారు. ‘లాల్ సింగ్ చడ్డా’ను బాయ్ కాట్ చేయాలని హంగామా సృష్టిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆమీర్ వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే… ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలైన మర్నాడే… అంటే ఆగస్ట్ 12న నితిన్ నటించిన సొంత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ కాబోతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా మీద నితిన్ బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక అదే రోజున గాంధీ హత్య నేపథ్యంలో, నాధురామ్ గాడ్సే మరణవాగ్మూలం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘1948 అఖండ భారత్’ మూవీ విడుదల కానుంది. ఆగస్ట్ 13, శనివారం నిఖిల్ ‘కార్తికేయ -2’ సినిమా రిలీజ్ అవుతోంది. శ్రీకృష్ణుడి కాలంలో సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారక నగర రహస్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. అలానే ఈ శుక్రవారం ఆహా ఓటీటీ సంస్థ కూడా రెండు అనువాద చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తోంది. అందులో ఒకటి ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం ‘మాలిక్’ కాగా, మరొకటి విజయ్ సేతుపతి ‘మహామనిషి’. ఈ రెండు కూడా ఆ యా భాషల్లో ఇప్పటికే థియేటర్లలో సందడి చేశాయి. ఆగస్ట్ 5న విడుదలైన సినిమాలు తీసుకొచ్చిన పాజిటివ్ వైబ్స్ ఈ వీకెండ్ మూవీస్ కు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.
Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
తాజావార్తలు
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
-
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుపాన్ పంజా.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త