తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన యువ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకడు. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ.. కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. నిఖిల్ సినిమా అంటే, కచ్ఛితంగా కంటెంట్ ఆసక్తికరంగా ఉంటుందని ఆడియన్స్ చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. అయితే.. అర్జున్ సురవరం తర్వాత ఈ యువ హీరో కాస్త నెమ్మదించాడు. ఈ చిత్రంతో పాటు అంతకుముందు చేసిన ‘కిరాక్ పార్టీ’ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ…
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఐదారు సినిమాల్లో నటిస్తున్నాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న ‘కార్తికేయ -2’ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు నిర్మాతలు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ సక్సెస్ ను సొంతం చేసుకుంటున్న క్రేజీ ప్రొడక్షన్ హౌసెస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ…