Anupama Parameswaran: కరోనా.. గత మూడేళ్ళుగా ప్రజలను వేధిస్తున్న మహమ్మారి. ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న ఈ వైరస్ ఇంకా ప్రజలను వదిలి పోవడంలేదు. ఇక ప్రముఖులు సైతం ఇంకా కరోనా బారిన పడడం ఆందోళన చెందిస్తోంది. ఇక తాజాగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ రెండు రోజుల క్రితం కరోనా బారిన పడినట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఆమె ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కార్తికేయ ప్రమోషన్స్ కోసం అన్ని రాష్ట్రాలు తిరగడంతో ఆమెకు దగ్గు, జలుబు రావడంతో కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఇంట్లోనే ఐసోలేషన్ లోకి వెళ్లిందట. అయితే లక్షణాలు తక్కువగా ఉండడంతో అనుపమ ఒక వారం రోజుల్లోనే కోలుకొని తిరిగి షూటింగ్స్ లో పాల్గొననున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం అనుపమ, నిఖిల్ సరసన 18 పేజీస్ సినిమాలో నటిస్తోంది. కార్తీకేయ 2 తో మ్యాజిక్ చేసిన ఈ జంట 18 పేజీస్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.