భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కాన్పూర్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. భారత ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు చాలా దూరం ప్రయాణించి స్టేడియంకు చేరుకుంటున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ కోహ్లి వీరాభిమాని దాదాపు 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కి స్టేడియానికి వచ్చాడు.
సక్సెస్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. తాజాగా ఈ హీరో ” భజే వాయు వేగం ” సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించగా., హ్యాపీడేస్ స్టార్ రాహుల్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్రాండ్ తో నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.…
Kartikeya’s Bhaje Vaayu Vegam Movie First Look Out: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ చివరిరగా నటించిన ‘బెదురులంక 2012’ సినిమా బాక్సాఫీక్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. రంజాన్ 2024 పర్వదినం సందర్భంగా ఈద్ ముబారక్ చెబుతూ.. గురువారం కార్తికేయ తన 8వ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు. శుక్రవారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం 12.06 నిమిషాలకు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ చేస్తున్నట్లు…
ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇబ్బందిగా మారిన సమస్య ఫేక్ న్యూస్ ప్రచారం. ముఖ్యంగా సెలబ్రెటీలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం చాలా మంది తమకు నచ్చిన టైటిల్స్ ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అసలు విషయం మరుగునపడిపోయి లేని వివాదంలో ఎంతో మంది చిక్కుకుంటున్నారు. తాజాగా ఇలానే తనకు సంబంధించి ఒక ఫేక్ వార్త రావడంపై హీరో కార్తికేయ ఘాటుగా…
కార్తికేయ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న 'బెదురులంక 20212' చిత్రంలోని రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. మణిశర్మ స్వరాలకు తగ్గట్టుగా ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాశారు.
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ కాగా క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'కలర్ ఫోటో' నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు.
గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు కార్తికేయ. పాత్ర నచ్చాలే కానీ ప్రతి నాయకుడి పాత్రకైనా సై అనే కార్తికేయ ఆ మధ్య నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ, ఇటీవల అజిత్ ‘వలిమై’లోనూ విలన్ పాత్రలే పోషించాడు. కానీ ఆ సినిమాలు కూడా అతనికి నిరుత్సాహాన్ని కలిగించాయి. తాజాగా కార్తికేయ హీరోగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also : Hari…
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పెళ్లి నేడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కార్తికేయ లోహితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చిరు ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆయన అయ్యప దీక్షలో ఉన్నందున, అతను పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కనిపించాడు. ఇక వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్‌లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా…
ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్ గా సత్తా చాటుతున్న యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో…