కర్ణాటకలో పెరుగుతున్న డెంగ్యూ కేసుల దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.
బెంగుళూరులో ఇద్దరు దుబాయ్ ప్రయాణీకులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సినిమా స్టైల్ లో ప్లాన్ చేశారు. బంగారాన్ని పేస్ట్ గా మార్చి దాంతో బెల్టు తయారు చేశారు. ఆ బంగారపు బెల్టుని అక్రంగా రవాణా చెయ్యడానికి ప్రయత్నించగా బెంగుళూరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా పలు హిందూ సంఘాలు కలబురిగిలో ఆదివారం నిరసన చేపట్టాయి.
BJP-JDS Alliance: కర్ణాటకలో వచ్చే 2024 లోక్సభ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య చర్చలు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.
BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న…
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ "విఐపి ట్రీట్మెంట్" ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.
ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్నా కూడా మహిళలపై లైంగిక దాడి జరుగుతూనే ఉంది.. ఇప్పుడు దుర్మార్గులు మూగ జీవాలను కూడా వదిలిపెట్టడం లేదు.. ఒక వ్యక్తి మేకపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి సమీప ప్రాంతం నుంచి మేకను అనుమానస్పదంగా తీసుకెళ్తుండగా చూసిన వ్యక్తి అతడు మేకపై దారుణానికి పాల్పడటం చూసి షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.. వివరాల్లోకి వెళితే..…
కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసి ఎండిపోయిన ప్రాంతంలోని నీటి వనరులకు జీవం పోశాయి.. ఆగస్ట్లో సుదీర్ఘ పొడి స్పెల్ తర్వాత, కలబురగి, బీదర్, యాద్గిర్ మరియు కొప్పల్ జిల్లాల్లో రాత్రిపూట మరియు ఆదివారం పదునైన జల్లులు కురిశాయి, ఆలస్యంగా విత్తిన రైతులకు ఆనందం కలిగించింది.. అయితే, రాబోయే కొద్ది రోజుల్లో ఇలాంటి మరిన్ని వర్షాలు కురిస్తే, కోతకు సిద్ధంగా ఉన్న పచ్చిమిర్చి మరియు ఉడకబెట్టిన పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కలబురగి జిల్లా…
Kumara Swamy: ఇటీవల ప్ట్రోక్కి గురైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కోలుకున్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇది తనకు మూడో పునర్జన్మ అని అన్నారు. తనకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడికి, చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Karnataka: కర్ణాటక రాష్ట్రానికి సొంత విమానయాన సంస్థను ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచిస్తోంది. స్థానికంగా కనెక్టివిటీ పెంచేందుకు సొంతంగా విమానయాన సంస్థలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలస్తున్నట్లు కర్ణాటక పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ శనివారం అన్నారు.