Naga Bhushana: ఫుట్ పాత్ పై వెళ్తున్న వారికి యాక్సిడెంట్ చేసిన నటుడు… ఒకరు భార్య మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను కన్నడ నటుడు కారుతో ఢీకొట్టాడు. దీని కారణంగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా భార్య చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో కొన్ని చిత్రాల్లో నటించిన నాగభూషణ శనివారం రాత్రి తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. కారు వేగంగా నడుపుతున్నాడు నాగభూషణ. రాత్రి 9.45 గంటల సమయంలో వసంత పుర ప్రధాన రహదారి వద్దకు వచ్చిన నాగభూషణ అక్కడ ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ జంటను ఢీ కొట్టాడు. ఆ యాక్సిడెంట్ లో 58 ఏళ్ల కృష్ణ, 48 ఏళ్ల ప్రేమ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: CBDT Chairman: సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా పదవీకాలం పొడగింపు.. వచ్చే ఏడాది జూన్ వరకు
Also Read
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
తరువాత కారు అక్కడే ఉన్న ఓ పోల్ ను ఢీకొట్టింది. అనంతరం నాగభూషణ నే స్వయంగా వారిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే మార్గ మధ్యలోనే ఆయన భార్య చనిపోయింది. తీవ్ర గాయాలైన కృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన రెండు కాళ్లు, తల, కడుపుకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై బెంగళూరులోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇక నాగభూషణం ఇక్కత్ (2021), బాదవ రాస్కెల్ (2021), హనీమూన్ (2022) వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల విడులైన ‘తగరు పల్లయ’ చిత్రంలో కూడా ఆయన కనిపించారు. నటుడు అతివేగంతో ఇలా డ్రైవ్ చేసి ప్రాణం పోవడానికి కారణం కావడంతో అతడిపై జనాలు మండిపడుతున్నారు. అయితే ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.
#Kannada actor #Nagabhushana rammed his #car into a couple walking on the #footpath near #Vasanthnagar main road in #Bengaluru around 9.45 pm. The woman died.
He was heading towards Konanakunte from Uttarahalli. Actor himself took the couple to the hospital. #accident #arrest pic.twitter.com/tAWrdX2yR2— Madhuri Adnal (@madhuriadnal) October 1, 2023
తాజావార్తలు
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!