మాములుగా దేవాలయాలకు దెయ్యాలు వెళ్లవు.. దేవుడి పేరు చెప్పగానే ఆమడ దూరం పారిపోతాయి.. అలాంటిది దెయ్యాలు అన్ని కలిసి ఓ శివాలయాన్ని నిర్మించాయి అంటే నమ్ముతారా?.. అలా జరిగే ఛాన్స్ లేదని అనుకుంటారు.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. మీరు విన్నది అక్షరాల నిజమే ఓ శివాలయాన్ని దెయ్యాలు నిర్మించాయి.. ఆ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఆ ఆలయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇది వినడానికి విచిత్రంగా, వింతగా ఉన్న ఇది నిజం ఈ ఆలయం మనదేశంలోనే ఉంది.. మన దేశంలోని మహిమాన్వితమైన దేవాలయాలలో ఈ దేవాలయం కూడా ఒకటిగా ఉంది. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం సైన్స్ కు సైతం అందని రహస్యం అని కొంతమంది భావిస్తారు. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లలో కొంతమంది దెయ్యాలు కూడా ఉండవచ్చని భావిస్తారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబళాపురం దేవనహళ్లి మార్గంలోని బొమ్మావర గ్రామంలో ఉన్న శివాలయంను దెయ్యాలు కట్టించాయని చాలామంది భావిస్తున్నారు. ఈ ఆలయంను సుందరేశ్వర ఆలయం..
సాధారణంగా గుడి మీద దేవుళ్లు, దేవతల ప్రతిమలు ఉంటాయి.. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవాలయంలో రాక్షసులు, దెయ్యాల విగ్రహాలు ఉంటాయి..600 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం ఉందని భోగట్టా. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో నివశించే ప్రజలను దెయ్యాలు ఎంతగానో భయపెట్టేవట. అక్కడి ప్రజలు మాంత్రికుని సూచన మేరకు శివాలయాన్ని నిర్మించడం చేశారు.. అప్పుడు గుడిని దెయ్యాలు తోసివేస్తె.. ఆ మాంత్రికుడు వాటిని వేశపరుచుకొని ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.. అప్పటినుంచి ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించిన ఆలయం అని పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు.. ఆ రాష్ట్రంలో ఫెమస్ దేవాలయాల్లో ఇది ఒకటి కావడం విశేషం..