రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 370 కు పైగా సీట్ల విజయమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థులలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలను రాబట్టాలని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని అర్థమవుతుంది. బుధవారం నాడు విడుదల చేసిన బీజేపీ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్-కొడగు స్థానం నుంచి మైసూర్ యువరాజు యదువీర్ కృష్ణదత్త ఒడెయార్ ను బరిలో బీజేపీ దింపింది. Also…
Bengaluru Cafe Blast Case : కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఘన విజయం సాధించింది. ప్రధాన నిందితుడిని ఏజెన్సీ అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య కొట్టి పారేశారు. అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు.
Shivaraj kumar: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన భార్య గీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శివమొగ్గ ఎంపీ స్థానం నుంచి గీత పోటీ చేస్తోంది. తన భార్యకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 9న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ భార్య గీత పేరు ఉంది. ఎన్నికల ప్రచారానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అవసరమైనప్పుడు…
Cruel woman: కర్ణాటక మంగళూర్లో ఓ మహిళ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. 87 ఏళ్ల మామపై అమానుషంగా ప్రవర్తించింది. వాకింగ్ స్టిక్తో దారుణంగా కొట్టింది. తనను కొట్టొద్దని వృద్ధుడు ఎంతగా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, సదరు మహిళ రాక్షసిలా ప్రవర్తించింది. ఈ హృదయవిదారక ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఈ ఘటన మార్చి 9న జరిగింది.
సమ్మర్ రాకముందే ఎండలు భగ భగ మండిపోతున్నాయి.. అప్పుడే ప్రముఖ నగరాల్లో నీటి కొరత, కరెంట్ కోతలు మొదలైయ్యాయి.. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా కర్ణాటక బెంగళూరులో నీటి కష్టాలు మొదలు అయ్యాయి. ఎండలు ముదరకుండానే మంచి నీటి కోసం కటకట మొదలైంది.. రోజు రోజుకు నీటి కష్టాలు పెరిగిపోతున్నాయి.. ఈ క్రమంలో నగరంలోని షాపింగ్ మాల్స్ లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. వాహనాలను కడగడం వంటివి చేస్తే భారీ జరిమానా చెల్లించుకోవాలని అధికారులు…
మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రెండు విక్రయాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. హిందువుల్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ చట్టాలను తీసుకువచ్చిందని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందని, చట్టాలను తీసుకువచ్చిందని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చని సూచించారు.