కర్ణాటకలో మరోసారి రాజకీయాలు చేయడానికి మరో కొత్త అంశం దొరికింది. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చేసిన వ్యాఖ్యలపై రచ్చ నడుస్తోంది. తాను హిందువునని.. ఇప్పటి వరక బీఫ్ తినలేదని.. కావాలనుకుంటే బీఫ్ తింటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి కర్ణాటకలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభం అయింది. ఆర్ఎస్ఎస్ మతాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోందని తుముకూరులో జరిగిన ఓ సభలో వ్యాఖ్యానించారు. బీఫ్ తినొద్దు అనడానికి నువ్వెవరు..? అని ప్రశ్నించాడు. బీఫ్ తినేవారంతా ఒకే వర్గానికి చెందిన వారు కాదని.. హిందువులు, క్రైస్తవులు కూడా బీఫ్ తింటారని వ్యాఖ్యానించారు.
ఇటీవల కర్ణాటక ప్రభుత్వ గోహత్య నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం కింద గోవులను, దున్నపోతులను చంపేస్తే.. వాటి మాంసాన్ని రవాణా చేస్తే ఏడేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఇదిలా ఉంటే సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేవారు. కర్ణాటక కాబినెట్ ఈ గోవధ నిరోధక చట్టం ఆర్డినెన్స్ తెచ్చిన రోజు… మా పార్టీకి చెందిన నేతలకు గోహత్య నిరోధక బిల్లును వ్యతిరేఖించే ధైర్యం లేదని కామెంట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి పెద్ద ఎత్తున మద్దతు ఉందని తెలిసి మా పార్టీ ( కాంగ్రెస్) పార్టీ నేతలు బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని అన్నారు.
గోవధ నిషేధ చట్టం ఆవు మాంసం అమ్మకాలను, వినియోగాన్ని అంతం చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అన్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ… గోహత్య నిరోధక చట్టం కొత్తది కాదని… 1964లో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింనది అన్నారు. అయితే బీజేప ప్రభుత్వం మాత్రం సమాజంలోని ఓ వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుందని ఆయన అన్నారు.