BS Yediyurappa Retirement: రాజకీయాలకు గుడ్‌బై.. ఇక నా వళ్లకాదు అంటున్న సీనియర్ పొలిటీషియన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ సీనియర్ పొలిటీషనర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు చేశారు.. కర్ణాటక రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు.. ఇప్పటి వరకు తాను ప్రాతినథ్యం వహిస్తూ వచ్చిన శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తున్నాను.. ఇకపై తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి బరిలోకి దిగుతారని.. రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప తన రెండవ కుమారుడైన విజయేంద్ర కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ను సూచిస్తూ, యడ్యూరప్ప తన కుమారుడికి ప్రజల మద్దతును కోరాడు మరియు తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.. కాగా, యడ్యూరప్ప 1983 నుంచి ఎనిమిది సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు..
మీరు నన్ను ఆదరించిన విధంగానే విజయేంద్రను కూడా ఆదరించాలని కోరుతున్నాను.. లక్ష ఓట్లకు పైగా మెజార్జీ సాధించేలా చూడాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు యడియూరప్ప.. ఇక, తాను వారానికోసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థి కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆయన, పార్టీలో ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.. 79 ఏళ్ల యడియూరప్ప.. లింగాయత్ నేతగా ఎదిగారు.. 2014లో షిమోగా నుండి లోక్‌సభ ఎంపీగా కూడా గెలిచారు. ఆయన కుమారుడు బీవై రాఘవేంద్ర 2014లో షికారిపుర నుంచి అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించారు.. ఇక, యడియూరప్పపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి.. కొన్ని వివాదాలు కూడా వెంటాడాయి.. కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందని చెప్పుకోవాలి.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!