Minister KTR: కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపలేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: కర్ణాటక ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీచమైన, ద్వేషపూరిత రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను మెప్పించడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను ఆకర్షించడంలో విఫలమైందని, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవని మంత్రి కేటీఆర్ అన్నారు. నీచమైన, విద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక వసతుల కల్పనలో, దేశ భవిష్యత్తు కోసం హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పాలని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ఆకాంక్షించారు.
Just the way Kerala Story failed to amuse people of Karnataka, similarly Karnataka election results will have NO bearing on Telangana
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
Thanks to the people of Karnataka for rejecting ugly & divisive politics 🙏
Let Hyderabad and Bengaluru compete healthily for investments &…
— KTR (@KTRBRS) May 13, 2023
కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రానుంది. కర్ణాటక ప్రజలు మోడీని ఓడించి, జేడీఎస్‌కి మద్దతు పలికిన కేసీఆర్ ని ఓడించారని, హాంగ్ రావాలని కేసీఆర్ చూశారన్నార టీ కాంగ్రెస్ నేతలు అన్నారు. మోడీని, కేసీఆర్ ఆలోచన కర్ణాటక ప్రజలు తిరస్కరించారని.. అదే ప్రభావం తెలంగాణ ఎన్నికలపై చూపుతాయన్నారు. కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారని ఎక్కడ ప్రజల తీర్పుని స్వాగతించలేదని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. మోడీ ఓడిపోతే కేటీఆర్ ఎందుకు బాధ పడుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర లో సభలు పెట్టె కేసీఆర్..కర్ణాటక లో ఎందుకు పెట్టలేదు. మోడీ ని ఓడించండి అని ఎందుకు పిలుపు ఇవ్వలేదు. తెలంగాణలో కూడా గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
Karnataka Results: కర్ణాటకలో సెంటిమెంట్ రిపీట్.. ఏ పార్టీ రెండో సారి గెలవలేదు
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!