Karnataka: కర్ణాటక చిత్తాపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ర్యాలీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. శాంతిభద్రతల సమస్యను పేర్కొంటూ అధికారులు అనుమతికి నిరాకరించారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన వ్యక్తి, సంస్థ శతాబ్ది ఉత్సవాలకు, విజయదశమి ఉత్సవం కోసం పట్టణంలో చిన్న స్థాయి ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరారు. దీనికి పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైంది. ఆదివారం ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు అనుమతి కోరిన అదే మార్గంలో భీమ్ ఆర్మీ,భారతీయ దళిత్ పాంథర్ (R)…
Bigg Boss 9 : కన్నడ బిగ్ బాస్ హౌస్ వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ హౌస్ ను మంగళవారం నాడు అధికారులు మూసేశారు. బయట నుంచి తాళం వేసేశారు. ఈ బిగ్ బాస్ హౌస్ ఉన్న బిడదిలోని అమ్యూజ్ మెంట్ పార్కుకు జాలీవుడ్ స్టూడియో నుంచి ప్రతి రోజూ 2.5లక్షల మురుగునీరు వస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ముందుగా నోటీసులు జారీ…
Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెను రాజకీయ మార్పులు వస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అంచనా వేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య అధికార పోరాటం జరుగుతుంద జోష్యం చెప్పారు. తాజాగా విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. సిద్ధరామయ్య తొందరపడుతున్నట్లు కనిపిస్తున్నారన్నారు.
Karnataka: కర్ణాటకలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో జరిగిన ఈద్ మిలాద్ వేడుకలు వివాదాలకు కేంద్రంగా మారాయి. రెచ్చగొట్టే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. వీటిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Dharmasthala: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హోరు. హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం సంచలనంగా మారింది.
President Murmu: కర్ణాటక మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం సిద్ధరామయ్యకు మధ్య ఆహ్లాదకరమైన సంభాషణకు వేదికగా మారింది. ‘‘మీకు కన్నడ తెలుసా.?’’ అని సీఎం, రాష్ట్రపతిని ప్రశ్నించారు. ఇందుకు ఆమె ‘‘తనకు భాష తెలియదని, అయితే నేర్చుకుంటానని మాత్రం హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (AIISH) డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ సంభాషణ జరిగింది.
పరాయి వ్యక్తులపై మోజు, అక్రమ సంబంధాలు భార్యాభర్తల బంధానికి బీటలుపారేలా చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రియుడి సాయంతో భర్తలను చంపేస్తున్నారు కొందరు భార్యలు. కొన్ని రోజుల క్రితం ఓ భార్య తన భర్తను సెల్ఫీ తీసుకుందామని చెప్పి నదిలోకి తోసేసిన విషయం తెలిసిందే. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపింది. అయితే ఈ కేసులో బిగ్…
Chicken: ఇటీవల కాలంలో ఆహార విషయంలో గొడవలు హత్యలకు కారణమవుతున్నాయి. పలు సందర్భాల్లో చిన్నపాటి వివాదాలు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాజాగా, కర్ణాటకలో ఓ వివాహ వేడుకలో ఎక్స్‌ట్రా చికెన్ డిమాండ్ చేసినందుకు ఓ వ్యక్తి తన స్నేహితుడినే చంపేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది.
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంని కమిషన్ నిర్ధారించింది. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదికలో వెల్లడించింది. నివేదికను సీఎం సిద్దరామయ్యకు అందించింది.
Shcoking Incident : మనుషుల మధ్య నమ్మకం రోజురోజుకూ తగ్గిపోతున్న సమాజంలో, భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్ర రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది…