కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
బెంగళూరులోని సంపిగేహళ్లి ప్రాంతంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిపై దాడి చేసి "జై శ్రీరామ్" అని నినాదం చేయమని బలవంతం చేశారని బాధితుడు చెప్పాడు. ఈ సంఘటన జూన్ 22న సాయంత్రం 4:30 - 5:30 గంటల మధ్య జరిగింది. బాధితుడి పేరు జమీర్. వృత్తిరీత్యా మెకానిక్. తన స్నేహితుడు వసీమ్‌తో కలిసి ఓ కస్టమర్ నుంచి డబ్బు వసూలు చేయడానికి బయటకు వెళ్లినట్లు సమాచారం. చొక్కన్‌హళ్లి సమీపంలోని చెట్ల గుత్తికి చేరుకోగానే.. 5…
Kiccha Sudeep : కర్ణాటక డిప్యూటీ సీఎం డీఏ శివకుమార్ కన్నడ ఇండస్ట్రీపై సీరియస్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో మాట్లాడుతూ.. కన్నడ సినిమా నటుల తీరు మారకపోతే వారిని ఎలా సరిచేయాలో తనకు తెలసు అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుదీప్ స్పందించారు. ఆయనపై మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎప్పుడు పిలిచినా మేమంతా వెళ్లేవాళ్లం. ప్రభుత్వానికి సహకరించడానికి మేమంతా ఎప్పుడూ రెడీగానే ఉంటాం. కన్నడ ప్రజల ఆశయాలను మేమంతా కనసాగిస్తున్నాం. Read…
పిల్లలు అల్లరి చేయడం కామన్. ఎదిగే పిల్లలు అమ్మ ఒడిని దాటి బయటి పరిసరాల్ని అర్థం చేసుకునే సమయంలో ఇలాంటివి సహజమే. ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. తమకు నచ్చింది తెచ్చివ్వాలని పట్టుదలకు పోతుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులకు కోపం తెప్పిస్తాయి. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. కొంత మంది మాత్రం అస్సలు భరించలేరు. చిన్న పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఓ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తల్లి దారుణానికి…
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటుచేసుకుంది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలువురు ఇప్పటికే ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ యాజమాన్యం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అంతే కాకుండా.. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం…
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడారు. జనసమూహాన్ని నిర్వహించడానికి 5000 మంది సిబ్బందిని నియమించినట్లు స్పష్టం చేశారు. కానీ మరణాల సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు. "నేను ఇంకా సంఖ్యలను నిర్ధారించలేను, నేను ఇప్పుడు స్టేడియంకు వెళ్తున్నాను. చాలా మంది భావోద్వేగ అభిమానులను చేరుకున్నారు. 5000 సిబ్బందిని మోహరించాం" అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇండియా టుడేతో అన్నారు.
Bangalore Teacher : ఒక్క ముద్దు పెడితే రూ.50వేలు. ఇది కర్ణాటకలోని ఓ ఖిలాడీ టీచర్ వ్యవహారం. ముద్దులు పెట్టి లక్షలు కాజేసింది. బెంగుళూరు లోని మహాలక్ష్మీ లే అవుట్ లో శ్రీదేవి అనే టీచర్ స్కూల్ టీచర్ గా పనిచేస్తోంది. అదే స్కూల్ కు రాకేష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాడు. పిల్లల కోసం తరచూ స్కూల్ కు వెళ్తున్న క్రమంలో శ్రీదేవితో పరిచయం బాగా పెరిగింది. శ్రీదేవి కూడా అతన్ని తన బుట్టలో…
బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హుళిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి తన భార్య గౌరి అనిల్ సాంబెకర్ (31)ను కిరాతకంగా కడతేర్చిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో నింపేశాడు. మొదట్లో ఈ ఘటన అనుకోకుండా జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తెలుస్తోంది.
కర్ణాటక ప్రజలు ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో చాలా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి లీటరుకు రూ. 4 పెంచుతున్నట్లు మంత్రి కె.ఎన్. రాజన్న గురువారం ప్రకటించారు.