Dharmasthala: ధర్మస్థలపై తప్పుడు ప్రచారం, డబ్బులు తీసుకుని యూట్యూబర్ల కథనాలు
- దేశవ్యాప్తంగా సంచలనంగా ‘‘ధర్మస్థల’’కేసు..
- ధర్మస్థల పవిత్రతను దెబ్బతీయడానికి కుట్ర..
- పలువురు యూట్యూబర్లకు వ్యతిరేక కథనాల కోసం నిధులు..
- కన్నడ యూట్యూబర్ సంచలన వాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmasthala: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హోరు. హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ‘‘ధర్మస్థలం’’పై అనేక వీడియోలు చేశారు. వందలాది శవాలు దొరుకుతున్నాయని హోరెత్తించారు. చివరకు ఎవరైతే ఈ ఆరోపణలు చేశాడో, అవన్ని తప్పుడు ఆరోపణలే అని తేలింది.
అయితే, ఇప్పుడు ఓ యూట్యూబర్ చేసిన వాదన సంచలనంగా మారింది. ధర్మస్థలను అవమానపరిచేలా, ధర్మస్థలకు వ్యతిరేకంగా కంటెంట్ చేయడానికి అనేక మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు డబ్బు చెల్లించారని ఆ యూట్యూబర్ పేర్కొన్నారు. య్యూట్యూబ్‌లో ‘‘గోల్డెన్ కన్నడిగ’’ వ్లాగ్ ఛానెల్ నిర్వహిస్తున్న సుమంత్ గౌడ ఈ సంచలన ఆరోపణలు చేశారు. హిందువులకు ఎంతో పవిత్రమైన పట్టణమైన ‘‘ధర్మస్థల’’కు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాలని తనకు కూడా డబ్బులు ఆఫర్ చేసినట్లు పేర్కొన్నారు.
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
Read Also: SIR: దేశ వ్యాప్తంగా ‘‘SIR’’ అమలుకు ఎన్నికల సంఘం సిద్ధం..!
ధర్మస్థలపై కంటెంట్ చేయడానికి డబ్బు తీసుకున్న అనేక మంది యూట్యూబర్లతో తాను మాట్లాడానని సుమంత్ వెల్లడించారు. దీని వెనక ఎవరున్నారు.. ఎవరు నిధులు ఇచ్చారు అనే విషయాలను మనం కనుక్కోవాలి. వారు నాకు డబ్బులు ఆఫర్ చేశారు.’’ అని అన్నారు. తన తోటి యూట్యూబర్ కూడా అలాంటి కంటెంట్ చేసినందుకు డబ్బులు వస్తున్నాయిని చెప్పాడని, డజన్ల కొద్దీ కంటెంట్ క్రియేటర్లుఈ విషయాన్ని వైరల్ చేశారని అన్నారు.
ఈ కేసులో, గతంతో ధర్మస్థల పర్యటనకు వచ్చి తన కూతురు తప్పిపోయిందని చెప్పిన ఒక మహిళ, తనను ఓ యూట్యూబర్ తప్పుడు ఆరోపణలు చేయాల్సిందిగా బలవంతపెట్టాడని ఆరోపించింది. లైంగిక వేధింపులకు గురైన అనేక మంది యువతుల మృతదేహాలతో సహా అనేక మంది మృతదేహాలను ఖననం చేసినట్లు చెప్పిన సీఎన్ చిన్నయ్య కూడా అబద్ధాలు చెప్పినట్లు సిట్ కనుగొంది. అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు కర్ణాటకలో రాజకీయంగా ఉద్రిక్తతలకు కారణమైంది. బీజేపీ దీనిని ‘‘హిందుత్వ వ్యతిరేక కుట్ర’’గా అభివర్ణించింది.
తాజావార్తలు
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!