బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట కేసులో జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు కారణం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంని కమిషన్ నిర్ధారించింది. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదికలో వెల్లడించింది. నివేదికను సీఎం సిద్దరామయ్యకు అందించింది.
READ MORE: Gudivada Tension: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ నేతల కార్లు ధ్వంసం.. పేర్నినాని హౌస్ అరెస్ట్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం జూన్ నాలుగవ తేదీన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని హాస్పిటల్స్‌కి తరలించి చికిత్స అందించారు. 18 ఏండ్ల తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో ప్లేయర్లందరికీ చిన్న స్వామి స్టేడియంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) సన్మానం ఏర్పాటు చేసింది. దీన్ని చూసేందుకు లక్షల మంది స్టేడియం వద్దకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఘటన చోటు చేసుకుంది.
READ MORE: Asim Munir: సైనిక ప్రభుత్వం దిశగా పాకిస్తాన్, షహబాజ్ షరీఫ్‌కు ఆసిమ్ మునీర్ చెక్..