DK Shiva kumar : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
కర్ణాటకలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించి పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరారు.
సార్వత్రిక ఎన్నికలు ముగియగానే వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ సేల్స్ ట్యాక్స్‌ను సవరణ చేసింది. దీంతో పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. కర్ణాటకలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సుమారు రూ. 3 మరియు రూ. 3.05 వరకు పెరగనున్నాయి.
ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని అస్సలు సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎంపీని దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించిందని, అభ్యంతరకర లైంగిక వీడియోలను విడుదల చేసిందని ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య ఉన్నందున ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
తాను ప్రాతినిధ్యం వహించే హుబ్లీ- ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్‌కు 58 ఎకరాల భూమి కేటాయించినా ఈ టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ ఆరోపించారు. ఇన్ఫోసిస్‌కు కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Pneumonia: కరోనా తర్వాత ప్రస్తుతం చైనాలో మర్మమైన న్యుమోనియా వ్యాధి భయాందోళనలను సృష్టించింది. ఇక్కడి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో చైనాలో పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది.
DK Shivakumar: కర్ణాటకలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసును రద్దు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. గతంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఈ కేసు నమోదైంది.
Hijab Ban: కర్ణాటకలో పరీక్షల సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు డ్రెస్ కోడ్ జారీ చేసింది. అందులో అన్ని రకాల హిజాబ్‌లను నిషేధించారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (కేఈఏ) ఈ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే రాజకీయ వర్గాల్లో పెను దుమారం చెలరేగింది.
Local Language Mandatory For Bankers: దేశంలో బ్యాంకింగ్ రంగం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు కూడా బ్యాంకింగ్ రంగంపై అవగాహన పెరగడంతో వారు కూడా ఎక్కువగా బ్యాంకులకు వెళుతున్నారు. ఇక ప్రభుత్వాలు అందించే అన్ని స్కీమ్ ల డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. దీంతో సాధారణ జనం చాలా మంది బ్యాంకులకు క్యూ కడుతున్నారు. అయితే స్కీంలకు సంబంధించిన వివరాలు కానీ, ఇన్యూరెన్స్ లాంటి విషయాలు కానీ, మరే ఇతర విషయాల…