Arvind Bellad: తాను ప్రాతినిధ్యం వహించే హుబ్లీ- ధార్వాడ్ వెస్ట్ నియోజకవర్గంలో ఇన్ఫోసిస్‌కు 58 ఎకరాల భూమి కేటాయించినా ఈ టెక్ దిగ్గజం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని బీజేపీ ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ ఆరోపించారు. ఇన్ఫోసిస్‌కు కేటాయించిన భూమిని తిరిగి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అయితే, కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యే అరివింద్ బెల్లాద్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడలో ఇన్ఫోసిస్‌కు 58 ఎకరాల భూమిని కేటాయించారు.. అయితే ఆ కంపెనీకి నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు.. ఆ కంపెనీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని వెల్లడించారు.
Read Also: Expressway : ఢిల్లీ నుండి జైపూర్ 2 గంటల ప్రయాణం.. 30శాతం తక్కువ చార్జీ.. విమానం లాంటి సౌకర్యం
కాగా, ఇన్ఫోసిస్ టెక్ దిగ్గజ కంపెనీ కోసం కోటి రూపాయల విలువ చేసే భూమిని సైతం రైతుల దగ్గర నుంచి తాను కేవలం 35 లక్షల రూపాయలకే ఇప్పించాను అనే విషయాన్ని ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ వెల్లడించారు. కానీ, ఆ కంపెనీ వల్ల వారి పిల్లలకు ఉపాధి లభిస్తుందని తాను హామీ ఇచ్చానని విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో గుర్తు చేశారు. ఇన్ఫోసిస్ కంపెనీ కేవలం ఒక్క ఉద్యోగం కూడా ఎవరికీ ఇవ్వకపోవడంతో తానిప్పుడు రైతుల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.