కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గృహలక్ష్మి యోజన ద్వారా మహిళలకు బహుమతులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గృహలక్ష్మి యోజనను ప్రారంభించనుంది.
Milk Price Hike: సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఆగస్టు 1 నుంచి నందిని పాల ధరను లీటరుకు రూ.3 పెంచుతూ కర్ణాటక మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నందిని అనేది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఉత్పత్తుల బ్రాండ్ పేరు. మంత్రివర్గ సమావేశంలో పాల ఉత్పత్తిదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక ప్రభుత్వం పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, 'అన్న భాగ్య' పథకం కింద ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు 5 కిలోల అదనపు బియ్యం అందించడానికి బదులుగా కిలోకు రూ.34 చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
కరోనా థర్డ్ వేవ్ విజృంభణ క్రమంగా తగ్గిపోతోంది.. దీంతో.. కరోనా కేసులు భారీ ఎత్తున నమోదైన సమయంలో.. కఠిన ఆంక్షలు విధిస్తూ.. అమలు చేస్తూ వచ్చిన ఆయా రాష్ట్రలు ఇప్పుడు సడలింపులబాట పడుతున్నాయి.. తాజాగా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించింది. సినిమా థియేటర్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, యోగా కేంద్రాలను.. పూర్తి సామర్థ్యంతో నడుపుకోవచ్చని పేర్కొంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్…
దేశంలో కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్లబ్స్, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లలో 50% కెపాసిటీతోనే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, డీజేకు అనుమతి లేదని స్పష్టం చేసింది. టీకా తీసుకోని వారికి వేడుకల్లో పాల్గొనేందుకు పర్మిషన్ ఉండదని తెలిపింది. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుంచి జనవరి 2, 2022 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. Read Also: 20 యూట్యూబ్…