Undavalli Arun Kumar: చిట్ ఫండ్ కంపెనీలను ప్రశ్నిస్తే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు నాపై కోపం ఎందుకు ? అని ప్రశ్నించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ వాళ్లు చర్చకు వెనుకకు ఎందుకు తగ్గారో అర్ధం కాలేదన్నారు.. ఇక, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు.. టీడీపీ, వైసీపీ నేతలు తిట్టుకుంటే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. ఇక, మార్గదర్శి కేసును ఈ ఏడాదిలో ముగింపుకు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని…
Congress: కర్ణాటక ఎన్నికల విజయంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ గా భావించిన కర్ణాటకలో అధికారంలోకి వస్తుండటం కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాాలని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి విజయాల కోసం ఎదురుచూస్తున్న హస్తం పార్టీ ఘన విజయం సాధించడంతో రానున్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు ఆ…
BJP out From South India: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మించి మంచి ఫలితాలు సాధించింది. కర్ణాటకలో అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రుల నుంచి ప్రధాన మంత్రి దాకా….ధీమా వ్యక్తం చేశారు. 140 సీట్లు సాధిస్తామని…అధికారంలోకి వస్తున్నామంటూ…ప్రతి బీజేపీ నేత ఢంకా భజాయించి చెప్పారు. సీన్ కట్ చేస్తే…బీజేపీ కనీసం 70 సీట్లు కూడా సాధించలేకపోయింది. బీజేపీ నేతలు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తుంటే…ప్రజలు మరోలా…
Telangana BJP: కర్ణాటక ఫలితాల తర్వాత ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అధికారం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. కర్ణాటక ప్రభావం.. తెలంగాణలో కచ్చితంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రధాన రాజకీయ పార్టీల్లో బలంగా ఉంది. అందుకే అక్కడ గెలిచిన వారికి ఇక్కడ మోరల్ బూస్ట్ దొరుకుతుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఐదునెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. స్టేట్ ఇప్పటికే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన కర్ణాటక…
Telangana Congress party: రాజకీయాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాల ప్రభావం దాని పక్కనే ఉండే రాష్ట్రాల మీద పడటం సహజం. కర్ణాటకతో తెలుగు రాష్ట్రాలు రెండూ సరిహద్దులు పంచుకుంటున్నా.. కాంగ్రెస్, బీజేపీలకు ఏపీలో పెద్ద పాత్ర లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీలు ప్రధాన శక్తులుగా తలపడుతున్నాయి. దీంతో మొదట్నుంచి కర్ణాటక ఫలితాలపై ఏపీ కంటే తెలంగాణలోనే ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు…
Priyanka Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 సీట్లకు గానూ 136 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 65 స్థానాల్లో గెలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇప్పుడంతా రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్య 2024లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని ప్రకటించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని…
Karnataka: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇటీవల కాలంలో ఇంతలా ఓడిపోవడం ఈ పార్టీకి ఇదే తొలసారి. ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 136, బీజేపీ 65 స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేశారు.