Karnataka Election: కర్నాటక ఎన్నికల్లో గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. విషయం ఏదైనా సరే పందెం కట్టడం అలవాటైన తెలుగు పందెం రాయుళ్లు.. కర్నాటక ఎన్నికలనూ వదలడం లేదు. ప్రచారం ప్రారంభం కాక ముందు నుంచే మొదలైన పందేలు.. ఇప్పుడు పీక్స్ కు చేరాయి. పోటాపోటీ ప్రచారం సాగడంతో పందెం రాయుళ్లు వ్యూహాలు మార్చుకుంటున్నారు. గత నెలలో కాంగ్రెస్ కు వంద నుంచి 103 సీట్లు వస్తాయని మొదలైన పందేలు ఇవాళ్టికి…