పాండిత్య ప్రసంగాలు, శక్తివంతమైన వక్తృత్వానికి పేరుగాంచిన కర్ణాటకలోని జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి సోమవారం కన్నుమూశారు. 81 ఏళ్ల పీఠాధిపతి గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు రాష్ట్రానికే మాత్రం పరిమితం కాదని, దేశం మొత్తానికి వర్తిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.
RRR Pre Release Event శనివారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా, ఆరోగ్య మంత్రి డా. కె. సుధాకర్, కన్నడ సీనియర్ నటుడు శివరాజ్ కుమార్ అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ భారీ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం వెనుక ఉన్న కారణాన్ని ముఖ్యమంత్రి వేదికపై వెల్లడించారు. ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన కర్ణాటక సీఎం “నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం భారత…
RRR Pre Release Event కర్ణాటకలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వంటి ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈ వేడుకలో మాట్లాడిన రాజమౌళి చిరంజీవి నిజమైన మెగాస్టార్ అని కొనియాడారు. టికెట్ రేట్ల విషయంలో సినిమా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి, టిక్కెట్ ధరలను పెంచడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఒప్పించినది ఆయనేనని వెల్లడించారు. దీని వల్ల చైరంజీవి చాలా ఘాటు వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి…
దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒవిలియా మోరిస్, శ్రియ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. స్పెషల్…
దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన మరణాంతరం ఆయనకు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ కు ‘కర్ణాటక రత్న’ అవార్డును అందిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విటర్ వేదికగా తెలిపారు. అక్టోబర్ 29 న పునీత్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతిని కన్నడిగులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికి పలువురు అభిమానులు ఆయన మృతిని తట్టుకోలేక ఆత్మహత్యలకు…
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మరి కాసేపట్లో సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్ స్టూడియోలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు. రాజ్ కుమార్ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ రాజ్…
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో.. కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. యడియూరప్ప వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డికి అప్పగించారు.. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో.. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు.. ఇవాళ సాయంత్రం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనున్నారు ఇరువురు నేతలు.. సాయంత్రం 7 గంటలకు బీజేఎల్పీ సమావేశం కానుంది. ఇక, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిపై…
యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011…