RRR Pre Release Event శనివారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా, ఆరోగ్య మంత్రి డా. కె. సుధాకర్, కన్నడ సీనియర్ నటుడు శివరాజ్ కుమార్ అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ భారీ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం వెనుక ఉన్న కారణాన్ని ముఖ్యమంత్రి వేదికపై వెల్లడించారు. ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన కర్ణాటక సీఎం “నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న రియల్ హీరోల కథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆయన డైరెక్టర్ కాదు క్రియేటర్. RRR చిత్రంతో దేశవ్యాప్తంగా సందడి చేసినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. RRR దేశం గర్వించదగ్గ చిత్రం అవుతుందని నేను నమ్ముతున్నాను. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటివారు” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. “ప్రతి ఒక్కరూ సినిమాను థియేటర్లలో చూడవలసిందిగా కోరుతున్నాను. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ సినిమా చూసి టీమ్‌ని అభినందించాలి” అని ప్రేక్షకులను బసవరాజ్ బొమ్మై కోరారు.
Read Also : Krithi Shetty : బేబమ్మ లక్ మామూలుగా లేదు… పవన్ సినిమాలో ఛాన్స్
“భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపతిరాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి అసామాన్య హీరోలకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ను అంకితం చేయాలని రాజమౌళిని కోరుతున్నాను’’ అని అన్నారు. ఇక స్వామి వివేకానంద చెప్పినట్లుగా, సాధకుడికి మరణం అంతం కాదు. మరణం తర్వాత జీవించే మనిషి నిజమైన సాధకుడు. పునీత్ నిజమైన సాధకుడు. ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉండే వరకు పునీత్ రాజ్‌కుమార్ జీవించి ఉంటాడు” అంటూ దివంగతః నటుడు పునీత్ రాజ్ కుమార్ ను కూడా గుర్తు చేసుకున్నారు. కాగా RRR తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 25 మార్చి 2022న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.