RRR Pre Release Event కర్ణాటకలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వంటి ప్రముఖులు విచ్చేశారు. ఇక ఈ వేడుకలో మాట్లాడిన రాజమౌళి చిరంజీవి నిజమైన మెగాస్టార్ అని కొనియాడారు. టికెట్ రేట్ల విషయంలో సినిమా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి, టిక్కెట్ ధరలను పెంచడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఒప్పించినది ఆయనేనని వెల్లడించారు. దీని వల్ల చైరంజీవి చాలా ఘాటు వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయితే అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఒక అడుగు వెనక్కి వేసి ఇండస్ట్రీ బాగు కోసం పోరాడారని రాజమౌళి అన్నారు. అంతేకాదు తెలంగాణలో అదనపు షోలు, టిక్కెట్ల పెంపుదలకు కూడా చిరంజీవే కారణమని, ఆయనే తెరవెనుక ఉండి అంతా నడిపించారని అన్నారు. ఇక టికెట్ రేట్ల పెంపుదలకు అనుమతినిచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం కేసిఆర్, సీఎం జగన్ లకు కూడా ఇదే వేదికపై కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : Deepika Padukone : ప్రభాస్ హీరోయిన్ సీక్రెట్ ఫోటోలు లీక్..!