కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో.. కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. యడియూరప్ప వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డికి అప్పగించారు.. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో.. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు.. ఇవాళ సాయంత్రం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనున్నారు ఇరువురు నేతలు.. సాయంత్రం 7 గంటలకు బీజేఎల్పీ సమావేశం కానుంది. ఇక, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిపై నివేదికను బీజేపీ అధిష్టానానికి అందించనున్నారు.. ఆ తర్వాత కొత్త సీఎంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాగా, కర్ణాటక సీఎం రేసులో ప్రహ్లాద్ జోషి, ముర్గేష్ నిరానీ, బస్వరాజ్ బొమ్మై ఉన్నారని తెలుస్తోంది.. ఈసారి ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశం ఉందంటున్నారు. యడియూరప్ప కేబినెట్‌లో ఉన్న 12 మంది మంత్రుల్ని తొలగిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఏదేమైనా.. యడియూరప్ప రాజీనామాతో కర్ణాటక రాజకీయాలో మరోసారి చర్చగా మారాయి.