యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011…
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు అయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడారు. రెండేళ్లపాటు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపినట్టు యడ్యూరప్ప ప్రకటించారు. పార్టీ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అన్నారు. పార్టీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాసేపట్టో ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన గవర్నర్‌ను కలిసి రాజీనామాను అందజేస్తారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని మారుస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.…