కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు (Karnataka High Court) ఝలక్ ఇచ్చింది. ఓ కేసులో ఆయనకు రూ.10 వేలు జరిమానా విధించింది.
పన్నుల బదలాయింపు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అన్నారు.
కన్నడ అనుకూల సంస్థలు సైన్‌బోర్డ్‌లు, నేమ్‌ప్లేట్లు, ప్రకటనలపై కన్నడ భాషను ప్రదర్శించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకస్మికంగా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. సైన్‌బోర్డ్‌లో 60 శాతం కన్నడలో ఉండాలని ఆయన తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి, ముఖ్యమంత్రి పదవులకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలోని అధికార పార్టీలో కలవరం మొదలైంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వరుణ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జూలై 28న విచారణ జరుపుతామని కర్ణాటక హైకోర్టు తెలిపింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య షాక్ ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధమైన జనసేవా ట్రస్టుకు అప్పటి బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంది. అయితే, వాస్తవానికి భూమి ఇస్తామని అప్పట్లో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి, కొంత ప్రాసెస్ చేసింది. అయితే తాజాగా భూమి ఇవ్వడం కుదరదని సిద్ధరామయ్య సర్కార్ తేల్చి చెప్పింది.
కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు కీలకమైనవి. అందులో ఒకటే.. అన్నభాగ్య పథకం.. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రతినెలా 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకం.. ప్రస్తుతం ఈ స్కీమ్ ఆరంభమైంది. ఇవాళ ( సోమవారం) సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఈ పథకాన్ని లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఈ పథకంలో సిద్ధరామయ్య సర్కార్ చిన్న…
కర్ణాటక ప్రభుత్వం పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, 'అన్న భాగ్య' పథకం కింద ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు 5 కిలోల అదనపు బియ్యం అందించడానికి బదులుగా కిలోకు రూ.34 చొప్పున నగదు ఇవ్వాలని నిర్ణయించింది.
BJP : సిద్ధరామయ్య రెండోసారి కర్ణాటక సీఎం అయ్యారు. ఆయన శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కొన్ని గంటల తర్వాత సిద్ధరామయ్య బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.