Karnataka Minister Umesh Katti dies of cardiac arrest: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి మంగళవారం మరణించారు. గుండె పోటు కారణంగా బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. 61 ఏళ్ల ఉమేష్ కత్తి బస్వరాజ్ బొమ్మై మంత్రి వర్గంలో పౌరసరఫరాలు, అటవీ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్టు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమేష్ కత్తి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం తెలిపారు. తాను కాంగ్రెస్ నాయకుడిని కలిశానని, తగిన భద్రతతో పాటు సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చానని తెలిపారు.
ఢిల్లీలో పలు సమావేశాలకు హాజరుకావాల్సిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి శనివారం కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం బసవరాజు బొమ్మై అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకటించారు.
కర్ణాటకలో ఓ బీజేపీ కార్యకర్త హత్య విషయంపై పార్టీలోనూ, బయటా నెలకొన్న ఒత్తిళ్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో పరిస్థితులకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని.. ఒకవేళ పరిస్థితులుగానీ మారితే పరిస్థితులు డిమాండ్ చేస్తే కర్ణాటకలో కూడా ‘యోగి మోడల్’ ప్రభుత్వం అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించారు.
RRR Pre Release Event శనివారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా, ఆరోగ్య మంత్రి డా. కె. సుధాకర్, కన్నడ సీనియర్ నటుడు శివరాజ్ కుమార్ అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ భారీ వేడుకకు ముఖ్య అతిథిగా రావడం వెనుక ఉన్న కారణాన్ని ముఖ్యమంత్రి వేదికపై వెల్లడించారు. ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన కర్ణాటక సీఎం “నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం భారత…
కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. అయితే గతంలో బీజేపీ అధిష్టానం ఆ రాష్ర్ట ప్రస్తుత సీఎంను తప్పిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం లేదని ఆయన చెప్పారు. దావోస్‌లో జరగబోయే…
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మరి కాసేపట్లో సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రాజ్ కుమార్ స్టూడియోలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి కడసారి వీడ్కోలు పలికారు. రాజ్ కుమార్ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ రాజ్…