Anji Reddy Chinnamile : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా వేములవాడ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశలంఓ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ.. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల 75 వేల పన్ను మినహాయింపు ఇచ్చింది..చాలా మందికి వేసులు బాటు లభించింది…60 ఏళ్ల నుండి కానిది మోడీ…
Ponnam Prabhakar : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం…
కరీంనగర్‌లో జరగనున్న పట్టభద్రుల సంకల్ప యాత్రకు రండి.. తరలిరండి.. అంటూ బీజేపీ పిలుపునిచ్చింది.. ఉమ్మడి కరీంనగర్ - ఆదిలాబాద్ - మెదక్ - నిజామాబాద్ పట్టభద్రుల ఓటరు లారా.. మన గళమై వస్తున్న మన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గొంతును బలపరిచేందుకు.. మన హక్కుల సాధన కోసం.. మన శక్తిని ప్రదర్శించేందుకు రండి అని సూచించారు..
Congress MLC Candidate: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వి.నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతో పాటు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 3.41 లక్షల గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి. ఇదివరకు బీఆర్ఎస్‌కు ఈ ప్రాంతం…
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్‌కి దీటుగా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలు ఘనంగా జరిగాయని, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకి మంత్రి ధన్యవాదాలు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా ఇటీవల సీఎం…
కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు.
కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు.
Gangula Kamalakar : నిన్న జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కుపోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు. జిల్లా ఇంచార్జీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి మీటింగ్ లో ఫెయిల్ అయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ రాజ్యం…
Road Accident: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబంలోని ఇద్దరు తండ్రి, కొడుకు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా గాంధీ నగర్ లో ప్రమాదం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో చేయాలని ఉన్నా ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్షణ దీక్షా శిబిరాన్ని కేఏ.పాల్ సందర్శించి మీడియాతో మాట్లాడారు.