కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
Bandi Sanjay : నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలే అని ఆయన వ్యాఖ్యానించారు. Kakinada: కుడా ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి.. కుప్పకూలిన స్టేజ్…
ఒక హోటల్ నుంచి మాజీ ఎమ్మెల్యే డబ్బులు మాయం అయిన ఉదంతం కరీంనగర్ లో కలకలం సృష్టించింది. ఇటీవల దీక్షాధీవస్ సభ జనసమీకరణ కోసం భారీగా డబ్బుల ఖర్చు చేశారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జిలకు పదిలక్షల రూపాయల చొప్పున సర్ధుబాటు చేసినట్లు సమాచారం. పదిలక్షలలో కేవలం ఐదులక్షలే ఖర్చు చేశారని.. కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా.. కార్యక్రమం ముగిసిన తరువాత వి పార్క్ హోటల్ లోని రూం నంబర్ 209 లో కార్యకర్తలతో కలిసి విందు ఏర్పాటు చేశారు. ఉదయం…
తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు.
Ponnam Prabhakar: త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
Posters in Jagtial: మంత్రగాళ్లూ తస్మాత్ జాగ్రత్త.. మాయమాటలు చెప్పే ప్రతి ఒక్కరినీ చంపేస్తాం.. అంటూ వాల్ పోస్టర్లు అంటించడం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కలకలం సృష్టించింది.
అది పేరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు. కానీ... తీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో ఉందట. ఎప్పుడో వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే సీటు కోసం ఇప్పట్నుంచే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టాయంటేనే దాని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇంతకీ ఏదా ఎమ్మెల్సీ?