Chinnamail Anji Reddy: బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ‘పట్టభద్రుల సంకల్ప యాత్ర’..
- కరీంనగర్‌లో పట్టభద్రుల సంకల్ప యాత్ర..
- భారీ సంఖ్యలో తరలిరావాలంటూ బీజేపీ పిలుపు..
- ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గొంతును బలపరిచేందుకు..
- మన హక్కుల సాధన కోసం.. మన శక్తిని ప్రదర్శించేందుకు రండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinnamail Anji Reddy: విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి.. తన నియోజకవర్గంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. అన్ని వర్గాల పట్టభద్రుల మద్దతు కూడగడుతున్నారు.. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా.. అంజిరెడ్డి విజయాన్ని సులువు చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అయితే, రేపు అనగా ఫిబ్రవరి 8వ తేదీన కరీంనగర్ వేదికగా భారీ ర్యాలీ, సభకు ఏర్పాట్లు చేస్తున్నారు..
Read Also: Dhoni House: ధోనీ ఇళ్లు డిజైన్ చూశారా.. గోడపై జెర్సీ నెంబర్ 7, హెలికాప్టర్ షాట్
Also Read
- Karimnagar : కరీంనగర్‌లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
కరీంనగర్‌లో జరగనున్న పట్టభద్రుల సంకల్ప యాత్రకు రండి.. తరలిరండి.. అంటూ బీజేపీ పిలుపునిచ్చింది.. ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ పట్టభద్రుల ఓటరు లారా.. మన గళమై వస్తున్న మన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గొంతును బలపరిచేందుకు.. మన హక్కుల సాధన కోసం.. మన శక్తిని ప్రదర్శించేందుకు రండి అని సూచించారు.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌లోని పద్మానగర్ నుంచి గీతా భవన్ సర్కిల్ వరకు సాగే పట్టభద్రుల సంకల్ప యాత్రకు భారీ సంఖ్యలో తరలిరండి అంటూ పిలుపు ఇచ్చారు బీజేపీ నేతలు.. ఇక, ఈ భారీ ర్యాలీ, సభకు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు.. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్, డీకే అరుణ, కె. లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. దిగ్విజయం చేయాలని కోరారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి.
తాజావార్తలు
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..