సింగరేణి సంస్థ దేశ స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ.. ఎంతో నిష్ణాతులైన, సమర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను కరీంనగర్లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు భూంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసింహరావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి. డా. భూంరెడ్డి హాస్పిటల్స్, డా. వి. రమాదేవి, మొదటి కొనుగోలుదారు చిదుర సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Food Poison : తాజాగా కరీంనగర్ పట్టణంలోని మిషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య రెసిడెన్సి కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ ఆయన ఆహారం తిని కళాశాలలోని 70 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో చైతన్య రెసిడెన్స్ కాలేజీ యాజమాన్యం నుండి విద్యార్థులను అంబులెన్స్ లో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న సమయం లో పెట్టిన భోజనంలో విద్యార్థులు సాంబార్ తినడంతో వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. T20 World…
కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక స్వామి వారి ఆశీర్వాద కోసం వచ్చానని..మొన్నటి ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం 43 వేల మెజారిటీ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన బిక్ష అని..సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణమని బండి సంజయ్ అన్నారు. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ బస్ స్టేషన్ లో ఓ తల్లి చిన్నారకి జన్మనిచ్చింది. ఆ చిన్నారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జీవితకాలం ఉచిత బస్ పాస్ మంజూరు చేసింది.
బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా తాము గెలిచామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సారి చెప్తున్నాం.. గెలుపు ఓటములు సహజమన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.