కరీంనగర్ జిల్లా కమాన్ వద్ద జరిగిన కారు ప్రమాదంపై మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. ఇది చాలా బాధకరమైన ఘటన. ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపై ఉండొద్దని చెబుతూ ఉన్నాం. సీసా కమ్ముల వారిని అక్కడ ఉండవద్దని చాలా సార్లు తీయించాం. కానీ కమాన్ దగ్గర ఉంటే ప్రమాదాలు జరుగుతాయని ముందే చెప్పాం వారు అక్కడే ఉంటున్నారు. స్పెషల్ టీం…
కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన కమాన్ కారు ప్రమాదంలో సంచలన అంశాలు బయట పడుతున్నాయి. కారు నడిపింది మైనర్ బాలుడని తేలింది. ఈ ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు మైనర్లు వున్నారని అంటున్నారు. ప్రమాదం జరిగే ఐదు నిమిషాల ముందు కమాన్ చౌరస్తా లోని పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకుని రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేశాడు మైనర్ బాలుడు. డ్రైవింగ్ రాకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు…
కరీంనగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలోని రెడ్డి స్టోన్ వద్ద ఆదివారం ఉదయం వేగంగా వచ్చిన ఓ కారు.. రోడ్డుపక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గుడిసెల్లో నివసిస్తున్న నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మాచారం తెలిసిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ నిర్వహించారు.…
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణికి శనివారం వైద్యులు ప్రసవం చేశారు. హుజూరాబాద్ మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన అపర్ణ అనే గర్భిణికి పురిటినొప్పులు రాగా శనివారం తెల్లవారు జామున ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. Read Also:కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్‌కు 700 కోట్లు లాభాలు వచ్చాయి: సీహెచ్ నరసింగరావు పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని…
కరోనా మహమ్మారి రోజురోజుకు పెరుగుతుండటంతో ఉద్యోగ ఉపాది అవకాశాలను చాలా వరకు కోల్పోయారు. ఒక ఇంట్లో ఎలాంటి చిన్న వేడుక జరిగినా ఎట్టలేదన్నా పదివేలకు పైగా డబ్బులు ఖర్చు అవుతాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక పెళ్లి వేడుకలకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి ఖర్చులో సింహభాగం భోజనాలకే అవుతుంది. కరోనా కాలంలో ఆ స్థాయిలో ఖర్చు చేయాలి అంటే మామూలు విషయం కాదు. అయితే, ఈ ఖర్చుల బాధ…
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్ , గాజుల రామారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయినపల్లి, అల్వాల్, మారేడుపల్లి, బేగంపేట, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి…
కరీనగర్ లో దారుణం చోటుచేసుకొంది. వారం రోజుల క్రితం మిస్ అయిన యువతి అడవిలో శవంగా తేలింది. ప్రేమించిన ప్రియుడే ఆమెకు యముడిగా మారాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి , అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ప్రియుడితో బయటికి…
సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా దేశ ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు, అధికారులు మీద కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కరీంనగర్ సీపీ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరు విద్వేషాలనురెచ్చగొడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఛానెల్ అని పెట్టి తమ లైన్ వక్రభాషను వాడుతున్నారని సీపీ అన్నారు. Read Also: బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయి:…
తన అరెస్టుపై బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ మారుణ కాండపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బండి సంజయ్ అన్నారు.ఈ ఘటనను గురించి తెలసుకునేందుకు ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్‌సింగ్ ఇక్కడకు వచ్చారన్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రాక్షస,…