కరీంనగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలోని రెడ్డి స్టోన్ వద్ద ఆదివారం ఉదయం వేగంగా వచ్చిన ఓ కారు.. రోడ్డుపక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో గుడిసెల్లో నివసిస్తున్న నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై మాచారం తెలిసిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ నిర్వహించారు. గుడిసెల మధ్య ఇరుక్కుపోయిన కారును క్రేన్‌తో బయటికి లాగి గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు. మృతిచెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని కచ్చల రాజేంద్రప్రసాద్‌గా పోలీసులు గుర్తించి విచారణ చేస్తున్నారు.