కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన కమాన్ కారు ప్రమాదంలో సంచలన అంశాలు బయట పడుతున్నాయి. కారు నడిపింది మైనర్ బాలుడని తేలింది. ఈ ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు మైనర్లు వున్నారని అంటున్నారు. ప్రమాదం జరిగే ఐదు నిమిషాల ముందు కమాన్ చౌరస్తా లోని పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకుని రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేశాడు మైనర్ బాలుడు.
డ్రైవింగ్ రాకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు పోలీసులు. కారు 100 స్పీడ్ తో జనంపైకి దూసుకెళ్లినట్లు అంటున్నారు. పోలీసుల అదుపులో కారు యజమాని రాజేంద్రప్రసాద్ వున్నారు. అతని కొడుకు మరో ఇద్దరు మైనర్లు పరారీలో వున్నారని తెలుస్తోంది. నిన్న రాత్రి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు జరుపుతున్నారు.