కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
కరీంనగర్ కాంగ్రెస్ కయ్యాలకు కేరాఫ్‌గా మారిపోయింది. గతంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న వార్ కాస్తా...ఇప్పుడు లీడర్ల మధ్యకు చేరింది. క్యాడర్‌ను గాడిలో పెట్టి స్థానిక ఎన్నికలకు సమాయాత్తం చేయాల్సిన ఇద్దరు కీలక నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ లోక్‌సభ సీటులో పోటీ చేసిన వెలిచాల రాజేందర్‌రావు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. వినాయక చవితి వేడుకల సాక్షిగా ఈ పోరు…
కరీంనగర్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. వీణవంక మండలానికి చెందిన మైనర్ బాలికను రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల శ్రీనివాస్ (32) పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాలిక కుటుంబ సభ్యులు వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతి చేసిన…
కరీంనగర్‌లో గుంతలు ఉన్న రోడ్డుపై కూర్చుని వాహనదారుడు నిరసన తెలిపారు.. నిబంధనలు పాటించకపోతే మాకు వేసే జరిమానాలు సరే.. మరి రోడ్లు బాగులేనందుకు మీరు నాకు ఎంత చెల్లిస్తారు జరిమానా అంటూ.. రేకుర్తి చౌరస్తా వద్ద రోడ్డుపై నిరసనకు దిగాడు కోట శ్యామ్ అనే ద్విచక్రవాహనదారుడు.. గుంతలు ఉన్న రోడ్డులో కూర్చుని నిరసన తెలిపాడు.
ఆయన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. దేశ రక్షణలో భాగమై బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు. కానీ నైతిక విలువలను మాత్రం మరిచాడు. భర్తగా, తండ్రిగా బాధ్యత నిర్వర్తించాల్సిన వాడు మూర్కుడిలా వ్యవహరించాడు. భార్య, కూతురును కట్టుబట్టలతో రోడ్డుపైన పడేశాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీహరి ఈ దారుణానికి ఒడిగట్టాడు. శ్రీహరికి 2011 స్రవంతితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. కాగా 2019 నుండి అత్త, భర్త శ్రీహరి భార్య…
కరీంనగర్ జిల్లా లో దారుణ హత్య జరిగింది. ఏడు నెలల గర్భిణీ నీ గొంతు కోసి హత్య చేశారు దుండగులు. అయితే హత్యకు ఆస్తి తగాదాలే కారణమని కొడుకే సవతి తల్లి నీ హతమార్చారని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు – రేణుక కు ఇద్దరు కుమారులు. అయితే రాములు గత ఏడు సంవత్సరాల క్రితం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మరో…
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆడుకుంటూ వెళ్లి వ్యవసాయబావిలో పడిపోయాడు 18 నెలల బాలుడు. కౌశిక్ నందు అనే బాలుడు బావిలో పడి మృతిచెందాడు. బాలుడిని వ్యవసాయ బావి వద్ద కూర్చోబెట్టి తల్లి పొలానికి నీళ్లు పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి కళ్ళముందే బాలుడు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో…
జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ... కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్‌ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగా శ్రావణి 43 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ మూడో స్థానంలో నిలిచినప్పటికి... కొన్ని గ్రామాలు, జగిత్యాల పట్టణంలో ఆధిక్యత ప్రదర్శించడం కేడర్‌లో జోష్ నింపింది.
Karimnagar Farmer Uses Tiger Doll to Protect Crops from Monkeys: కోతుల బెడుదల నుంచి తన పంట పొలాలను కాపాడుకునేందుకు ఓ రైతు వినుత ఆలోచన చేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన రైతు కామెర రాజ్ కుమార్ తనకున్న ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ.. జీవనం గడుపుతున్నాడు. అయితే కోతులు రోజు వచ్చి కూరగాయల పంటను చెడగొట్టడంతో.. పలుమార్లు విసిగిపోయాడు. దాంతో రైతు రాజ్ కుమార్ ఓ వింత…