Off The Record: బడా బీజేపీ నేతల జిల్లాల్లో కొత్త అధ్యక్షుల నియామకం ఎందుకు ఆగిపోయింది?
- రెండు జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్..
- కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో పీటముడులు..
- కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్..
- మల్కాజ్‌గిరి ఎంపీగా ఈటల రాజేందర్..
- ఆ ఇద్దరు ఉన్న చోట్లే ఎందుకు ఆగిపోయింది?..
- ఈటల చెప్పిన పేరును లోకల్ లీడర్స్ ఒప్పుకోవడం లేదా?..
- రాష్ట్ర పెద్దలు చెబుతున్న వ్యక్తికి, బండి సూచిస్తున్న నేతకు తేడా ఉందా?..
- కొత్త జిల్లా అధ్యక్షులు కొందరిపై అప్పుడే అసంతృప్తి..
- రెండు మూడు చోట్ల మార్చి కొత్త వాళ్ళను పెడతారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా అడపా దడపా కొన్ని చోట్ల స్థానిక కమిటీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ… ఇంకొక్క విషయంలో మాత్రం పీటముడి గట్టిగానే బిగుసుకుపోయినట్టు కనిపిస్తోంది. పార్టీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉంటే… 36 చోట్లే అధ్యక్ష ఎన్నిక పూర్తయింది. ఆయా జిల్లాల్లో కమిటీలు కూడా దాదాపుగా పడ్డాయి. ఇక అనుబంధ కమిటీలు, అధికార ప్రతినిధుల నియామకం కూడా త్వరలోనే పూర్తవబోతోంది. కానీ… రెండు జిల్లాల విషయంలో పడ్డ పీటముడి మాత్రం ఎంతకీ విడిపోవడం లేదట. ఎలా తెగ్గొడదామని చూస్తున్నా… అక్కడ పంచాయితీలు మాత్రం తెగడం లేదంటున్నారు. అలా పెండింగ్‌లో పడ్డ రెండు జిల్లాల్లో ఒకటి కరీంనగర్ అయితే మరొకటి మేడ్చల్ మల్కాజ్ గిరి. ఈ రెండు చోట్ల పార్టీకి చెందిన ఉద్దండుల్లాంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినాసరే… అధ్యక్షుల నియామక వ్యవహారాన్ని మాత్రం తేల్చలేకపోతున్నారన్న మాట బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ ఎంపీలుగా ఉన్నారు. అలాంటి రెండు చోట్లే జిల్లా అధ్యక్షులను నియమించలేకపోవడం పోవడం ఏంటన్నది కమలం నాయకుల క్వశ్చన్.
Read Also: Off The Record: లిక్కర్ కేసులో చెవిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నాయా..?
Also Read
పార్టీ వ్యవహారాల పరంగా ముందుండాల్సిన ఆ జిల్లాల్లో నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటం ఏంటన్న విమర్శలు పెరుగుతున్నాయి. కరీంనగర్ కు జిల్లా అధ్యక్షుడిగా గతంలో ఉన్న వ్యక్తే కొనసాగుతున్నా.. మేడ్చల్ మల్కాజ్ గిరికి మాత్రం అసలు అధ్యక్షుడే లేడు. పార్లమెంట్ ఎన్నికలకి ముందు రాజీనామా చేశారు అక్కడి నాయకుడు. తర్వాత ఓ సీనియర్ నేతకు సమన్వయ బాధ్యతలు అప్పగించినా..ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ తర్వాతి పరిణామాలు ఏవీ జరగలేదు. ఇక్కడ ఎంపీ ఈటల ఒకరి పేరు చెబితే… స్థానిక నేతలు ఇంకో పేరు చెబుతున్నారట. ఎంపీ చెప్పిన పేరును ఒప్పుకునే ప్రసక్తే లేదని స్థానిక నేతలు అంటున్నట్టు సమాచారం. అలాగే కరీంనగర్‌లో ఎంపీ చెబుతున్న దానికి, రాష్ర్ట పార్టీ పెద్దలు అనుకుంటున్న దానికి మధ్య చాలా తేడా ఉందట. అలా… ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా మేటర్ మాత్రం కొలిక్కి రావడం లేదని చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు ఎన్నికైన జిల్లా అధ్యక్షుల్లో కొందరు పని తీరుపై ఇప్పటికే అసంతృప్తి మొదలైనట్టు తెలుస్తోంది. స్థానిక నేతలను కలుపుకొని పోవడంలో విఫలం అవుతున్నారట నయా ప్రెసిడెంట్స్. వాళ్ళు ఎంపీలతో కూడా కలివిడిగా ఉండటంలేదంటున్నారు. అందుకే… ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఒక జిల్లా అధ్యక్షుడితో పాటు మరో రెండు చోట్ల రాజీనామాలు చేయించి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలా మొత్తంగా…. తెలంగాణ బీజేపీ సంస్థాగత వ్యవహారం పెద్ద ప్రసహసనంగా మారిపోయిందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!