కరీంనగర్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. వీణవంక మండలానికి చెందిన మైనర్ బాలికను రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల శ్రీనివాస్ (32) పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాలిక కుటుంబ సభ్యులు వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతి చేసిన వ్యక్తి పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు.